ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ కూడా ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో రాయల్స్ 3 పరుగుల తేడాతో గెలిచింది. 176 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. ఆశల్లేని స్థితిలో ధోనీ (32;17 బంతుల్లో1×4, 3×6),జడేజా(25*; 15 బంతుల్లో 1×4, 2×6) అద్భుతంగా పోరాడినా చెన్నైను గెలిపించలేకపోయారు. ఆ జట్టులో కాన్వే (50; 38 బంతుల్లో 6×4) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్పిన్నర్లు అశ్విన్ (2/25), చాహల్ (2/27) సీఎస్కేకు కళ్లెం వేశారు.
IPL 2023: ధోనీ దంచినా CSKకు తప్పని ఓటమి.. రాజస్థాన్ విజయం - రాజస్థాన్ రాయల్స్ విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రసవత్త పోరులో రాజస్థాన్ విజయం సాధించింది. ఆఖరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో రాయల్స్ 3 పరుగుల తేడాతో గెలిచింది.
అంతకుముందు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ శుభారంభం చేశారు. అయితే ఆదిలోనే రాజస్థాన్ మొదటి వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్‌పాండే వేసిన రెండో ఓవర్‌లో నాలుగో బంతికి యశస్వీ జైస్వాల్ (10) మిడాఫ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన దేవదత్ పడిక్కల్ (38) ఔటయ్యాడు. జడేజా వేసిన 8.3 ఓవర్‌కు డేవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్ నిరాపరిచాడు. జడేజా వేసిన 8.5 ఓవర్‌కు సంజూ శాంసన్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆకాశ్ సింగ్ వేసిన 15 ఓవర్‌లో రెండు, మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన ఆల్‌రౌండర్ అశ్విన్ (30) ఇదే ఓవర్‌లో చివరి బంతికి మగాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓపెనర్‌గా వచ్చి దుమ్మురేపిన బట్లర్ ఔటయ్యాడు. మొయిన్ అలీ వేసిన 17 ఓవర్లో రెండో బంతికి జోస్ బట్లర్ (52) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్.. నాలుగు పరుగుల సాధించి ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔటయ్యాడు. జేసన్ హోల్డర్, జంపా డకౌట్‌గా పెవిలియన్ చేరారు. హెట్ మెయర్(30*) నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్ 175 పరుగులు సాధించింది.
ఆకాశ్ సింగ్ అరంగేట్రం
గతేడాది ఐపీఎల్‌లో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్‌బౌలర్ ముఖేశ్ చౌదరి గాయం కారణంగా ఈ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్ సింగ్‌ను ఈ మ్యాచ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ 20 ఏళ్ల ఫాస్ట్‌బౌలర్ ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆకాశ్ సింగ్‌ను రూ.20 లక్షలకు సీఎస్కే తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆకాశ్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.