ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. ప్రత్యర్థి చెన్నైకి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ అదరగొట్టాడు. పడిక్కల్, అశ్విన్ రాణించగా.. కెప్టెన్ సంజూ నిరాశపరిచాడు. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. మెయిన్ అలీ ఒక వికెట్ తీశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ శుభారంభం చేశారు. అయితే ఆదిలోనే రాజస్థాన్ మొదటి వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్‌పాండే వేసిన రెండో ఓవర్‌లో నాలుగో బంతికి యశస్వీ జైస్వాల్ (10) మిడాఫ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన దేవదత్ పడిక్కల్ (38) ఔటయ్యాడు. జడేజా వేసిన 8.3 ఓవర్‌కు డేవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్ నిరాపరిచాడు. జడేజా వేసిన 8.5 ఓవర్‌కు సంజూ శాంసన్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆకాశ్ సింగ్ వేసిన 15 ఓవర్‌లో రెండు, మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన ఆల్‌రౌండర్ అశ్విన్ (30) ఇదే ఓవర్‌లో చివరి బంతికి మగాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓపెనర్‌గా వచ్చి దుమ్మురేపిన బట్లర్ ఔటయ్యాడు. మొయిన్ అలీ వేసిన 17 ఓవర్లో రెండో బంతికి జోస్ బట్లర్ (52) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్.. నాలుగు పరుగుల సాధించి ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔటయ్యాడు. జేసన్ హోల్డర్, జంపా డకౌట్‌గా పెవిలియన్ చేరారు. హెట్ మెయర్(30*) నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్ 175 పరుగులు సాధించింది.