టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ అజింక్యా రహానే ఐపీఎల్-2023లో అరుదైన ఘనతను సాధించాడు. సీఎస్కే తరఫున ఆడుతున్న రహానే.. సీజన్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు. అంతేకాకుండా కేవలం ఒక్క ఓవర్లోనే 23 పరుగులు సాధించడం మరో విశేషం. శనివారం ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నెలకొల్పాడు రహానే. ఇక ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బలమైన జట్టుగా భావించే ముంబయికి ఓటమి రుచి చూపించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. 158 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 18.1 ఓవర్లోనే కేవలం 3 వికెట్లను కోల్పోయి సునాయాసంగా టార్గెట్‌ను ఛేదించింది.
రహానే కుమ్ముడు..!
ఈ మ్యాచ్‌లో అజింక్యా రహానే మంచి దూకుడును ప్రదర్శించాడు. ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే రహానే.. ఈ ఇన్నింగ్స్‌లో ఒక్కసారిగా తన ఉగ్రరూపాన్ని చూపించాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రహానే 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 61 పరుగులు చేసి చెలరేగిపోయాడు. అలాగే కేవలం 19 బాల్స్‌లోనే రహానే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రహానే నిలిచాడు. అర్షద్ ఖాన్ వేసిన 4వ ఓవర్లో రహానే విజృంభించాడు. ఈ ఓవర్లో 1 సిక్స్, 4 ఫోర్లు కొట్టి ఏకంగా 23 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ ఫీట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అద్భుత ఇన్నింగ్స్ ఆడిన 34 ఏళ్ల రహానేపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
"నా హోమ్గ్రౌండైన వాంఖడేలో మ్యాచులు ఆడటాన్ని నేనెంతగానో ఆస్వాదిస్తాను. అయితే ఇక్కడ నేనెప్పుడూ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. దీంతో ఈ గడ్డపై భవిష్యత్‌లో టెస్టు ఆడాలని కోరుకుంటున్నాను."-