తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 : రూ.16 కోట్లకు 15 పరుగులే.. ఒక్కో రన్​కు కోటి కన్నా ఎక్కువే! - IPL 2023 auction expensive players

ఐపీఎల్​ 16వ సీజన్​ కోసం చెన్నై సూపర్​ కింగ్స్ జట్టు.. ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ బెన్​ స్టోక్స్​పై ఎన్నో అంచనాలతో భారీ మొత్తాన్ని వెచ్చించింది. ఏకంగా రూ.16.25 కోట్లకు కొనుగోలు చేస్తే.. అతడు కేవలం 15 పరుగులే చేసి నిరాశపరిచాడు.

IPL 2023 auction
ఐపీఎల్ వేలం 2023

By

Published : May 19, 2023, 8:12 PM IST

Updated : May 19, 2023, 8:25 PM IST

IPL 2023 : ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన డొమెస్టిక్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్​. ఈ క్యాష్​ రిచ్​ లీగ్​ కోసం దేశీయ ఆటగాళ్లతో పాటు, పలు దేశాలకు చెందిన ప్లేయర్లను వేలం ప్రక్రియ ద్వారా ఆయా జట్లు కొనుగోలు చేస్తాయి. టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు వారు కొనుగోలు చేసే ఆటగాళ్ల ఖర్చు రూ.90 కోట్ల పరిమితిలోనే ఉండేలా చూసుకోవాలనే నిబంధన ఉంది. అయితే 16వ సీజన్​ ​కోసం ఐపీఎల్ నిర్వాహకులు.. గతేడాది డిసెంబరులో మినీ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఎక్కువ మొత్తంలో ధర పలికిన ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందో చూద్దాం.

బెన్​ స్టోక్స్..
ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్​ కింగ్స్ జట్టు.. 31 ఏళ్ల బెన్​ స్టోక్స్ కోసం ఏకంగా రూ. 16.25 కోట్లు వెచ్చించింది. ఈ సీజన్​లో స్టోక్స్​ అంతగా రాణించలేకపోయాడు. ప్రస్తుత సీజన్​లో ఇప్పటి వరకు కేవలం రెండంటే రెండే మ్యాచ్​లు ఆడిన ఈ ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ 15 పరుగులే సాధించాడు. అటు బంతితోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. రూ.16 కోట్లకు కొంటే కోటి రూపాయలకు ఒక పరుగు చొప్పున అతడు 16 పరుగులు కూడా చేయలేదంటూ చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు దంచేస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్.. బెన్​ స్టోక్స్​

శామ్​ కరన్..
ఈ మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ శామ్​ కరన్ రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. కరన్​ను పంజాబ్​ రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్​ ఆడుతున్న శామ్ కరన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 12 ఇన్నింగ్స్​ల్లో ఒకే అర్ధ సెంచరీతో కేవలం 227 పరుగులే చేశాడు. అటు బౌలింగ్​లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శనేమీ లేదు. 10 ఎకనమీతో 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో శామ్ కరన్ రూ.18.50 కోట్ల విలువైన ఆటగాడేమీ కాదంటు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పంజాబ్​ కింగ్స్.. శామ్​ కరన్

కామెరూన్ గ్రీన్..
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్​ను ముంబయి ఇండియన్స్ రూ.17.50 కోట్లకు దక్కించుకుంది. ఆ ధరతో గ్రీన్ ఐపీఎల్‌ వేలం చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్​లో 13 మ్యాచ్​లు ఆడిన గ్రీన్.. 40.14 సగటుతో 281 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్​లో ఫర్వాలేదనిపించిన గ్రీన్.. బౌలింగ్​లో కాస్త ఎక్కువగానే పరుగులు సమర్పించుకున్నాడు. తాజాగా లఖ్​నవూతో మ్యాచ్​లో ముంబయి ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన దశలో గ్రీన్ క్రీజులో ఉన్నప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోవటంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ మ్యాచ్​లో 6 బంతులు ఆడిన గ్రీన్ 4 పరుగులే చేసి నాటౌట్​గా నిలిచాడు. ఇది విమర్శలను మరింత పెంచింది.

ముంబయి ఇండియన్స్ .. కామెరూన్ గ్రీన్.

నికోలస్ పూరన్​..
వెస్టిండీస్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ను లఖ్‌నవూ జట్టు రూ.16కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్​లో మిడిల్​​ ఆర్డర్​లో వచ్చిన పూరన్ బెంగళూరుపై 19 బంతుల్లోనే 62 పరుగులు, పంజాబ్​పై 45 పరుగులతో రాణించాడు. హైదరాబాద్​పై చివరి ఐదు ఓవర్లలో 68 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన పూరన్ 338 స్ట్రయిక్ రేట్​తో 13 బంతుల్లోనే 44 పరుగులు చేసి లఖ్‌నవూకు విజయం కట్టబెట్టాడు. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా పూరన్​ తన మార్క్​ను చూపి ఫర్వాలేదనిపించాడు.

లఖ్​నవూ సూపర్ జెయింట్స్​.. నికోలస్ పూరన్​

హ్యారీ బ్రూక్‌..
సన్​రైజర్స్ హైదరాబాద్‌.. ఈ ఇంగ్లాండ్‌ యువ బ్యాటర్​ను ఏకంగా రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసి అతడిపై అంచనాలు పెంచింది. కానీ బ్రూక్‌.. వేలంలో సృష్టించిన సంచలనం తన ఆటలో కనబడలేదు. కోల్​కతాపై ఆడిన మ్యాచ్​లో శతకం బాదిన బ్రూక్‌.. తర్వాత మరే మ్యాచ్​లోనూ 50 పరుగులు చేసింది లేదు. ఈ సీజన్​లో 10 మ్యాచ్​​ల్లో సెంచరీతో సహా బ్రూక్ చేసిన పరుగులు 190 మాత్రమే. అంటే మిగిలిన తొమ్మిది ఇన్నింగ్స్​ల్లో అతడు చేసింది 90 పరుగులే. దీంతో సోషల్ మీడియాలో ఆరెంజ్​ఆర్మీ ఫ్యాన్స్​ టీమ్​ యాజమాన్యాన్ని తెగ తిడుతున్నారు.

సన్​రైజర్స్ హైదరాబాద్‌.. హ్యారీ బ్రూక్‌
Last Updated : May 19, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details