సామ్ కరన్ (55) విధ్వంసక బ్యాటింగ్‌కు అర్ష్‌దీప్ (4/29) సూపర్ బౌలింగ్‌తో తోడవడం వల్ల.. ఆసక్తికరంగా సాగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే వాస్తవానికి ముంబయికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. అది మరీ అసాధ్యమేమీ కాదు. కానీ అర్ష్‌దీప్.. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశమివ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కేవలం రెండే పరుగులిచ్చి రెండు వికెట్లను పడగొట్టాడు. తిలక్, వధేరాలను బౌల్డ్ చేశాడు. అతడి దెబ్బకు ఈ రెండు సందర్భాల్లోనూ స్టంప్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఎలా అంటే..215 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి జట్టులో రోహిత్ (44), కామెరూన్ గ్రీన్ (67), సూర్యకుమార్ యాదవ్ (57)ల విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. ఆ టీమ్ విజయానికి దగ్గరగా వెళ్లింది. అయితే చివరి ఓవర్లో ముంబయికి.. విజయానికి మరో 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలోనే క్రీజులో ఉన్నవధేరా, తిలక్ వర్మకు బంతులను సంధించాడు అర్ష్‌దీప్. మొదటి బంతికి ఒక పరుగే వచ్చింది. సెకండ్‌ది డాట్ బాల్. మూడో బాల్ యార్కర్ సంధించాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన బాల్‌ను అంచనా వేయడంలో తిలక్ వర్మ కాస్త గతి తప్పాడు. దీంతో బాల్.. మిడిల్ స్టంప్ రెండు ముక్కలైంది. ఇక నాలుగో బంతికి కూడా మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. వధేరా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో వికెట్ కూడా గాల్లోకి ఎగిరి రెండు ముక్కలైంది.