తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 RCB VS GT : ప్లేఆఫ్స్​లో ఆర్సీబీకి నిరాశ.. బెంగళూరుపై టైటాన్స్‌ విజయం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్​లో  గుజరాత్​ టైటాన్స్​ విజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో నెగ్గి ప్లేఆఫ్స్‌ చేరాలనుకున్న ఆర్సీబీ జట్టుకు నిరాశ తప్పలేదు. టైటాన్స్‌ చేతిలో ఓటమితో ఆర్సీబీ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది.

Royal Challengers Bangalore vs Gujarat Titans
Royal Challengers Bangalore vs Gujarat Titans

By

Published : May 22, 2023, 6:32 AM IST

RCB VS GT : ఐపీఎల్​లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో బెంగళూరుకు భంగపాటు కలిగింది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో నెగ్గి ప్లేఆఫ్స్‌ చేరాలనుకున్న ఆ జట్టుకు నిరాశే మిగిలింది. ప్రత్యర్థి జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమి పాలైన ఆర్సీబీ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. విరాట్‌ కొట్టిన సూపర్‌ శతకం కూడా వృథా అయింది. అయితే ఎప్పుడో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన టైటాన్స్‌.. శుభ్‌మన్‌ గిల్‌ సూపర్‌ శతకంతో ఆదివారం 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. విరాట్‌ కోహ్లి సెంచరీతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 197 పరుగులను స్కోర్​ చేసింది. మరోవైపు గిల్‌తో పాటు విజయ్‌ శంకర్‌ మెరవడం వల్ల ఈ కొద్దిపాటి లక్ష్యాన్ని టైటాన్స్‌.. 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఛేదనలో శుభ్‌మన్‌ హైలైట్‌గా నిలిచాడు. పోరాటంతో, వరుసగా రెండో శతకాన్ని సాధించిన అతడు టైటాన్స్‌కు విజయాన్ని అందించాడు. మరో ఓపెనర్‌ సాహా త్వరగానే ఔటైనప్పటికీ.. గిల్‌ మాత్రం ఈ మ్యాచ్​లో అదరగొట్టాడు. 5 ఓవర్లకు గుజరాత్‌ 35 పరుగులే స్కోర్​ చేసినప్పటికీ.. ఆ తర్వాత గిల్‌ చెలరేగడం వల్ల స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇక వైశాఖ్‌, హిమాంశు ఓవర్లలో సిక్స్‌లు కొట్టాడు. విజయ్‌ శంకర్‌ కూడా రాణించడం వల్ల గుజరాత్‌ 10 ఓవర్లలో 90/1 స్కోర్​తో నిలిచింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన గిల్‌ 29 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

మరోవైపు విజయ్‌ శంకర్‌ దూకుడుగా ఆడకపోయినప్పటికీ.. గిల్‌ మాత్రం తన ధనాధన్‌ బ్యాటింగ్​తో గుజరాత్‌ జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. అయితే బ్రాస్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లో గిల్‌.. లాంగ్‌ లెగ్‌, డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌లను బాదేశాడు. విజయ్‌ శంకర్‌ కూడా జోరందుకుని వైశాఖ్‌ ఓవర్లో వరుసగా 4, 4, 6 దంచేశాడు. కానీ ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. ఆ వెంటనే శానకను హర్షల్‌ ఔట్‌ చేయడం, స్కోరు వేగం తగ్గడం వల్ల మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. బెంగళూరు పోటీలోకి వచ్చింది. చివరి మూడు ఓవర్లలో టైటాన్స్‌ 34 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 18వ ఓవర్లో మిల్లర్​ను సిరాజ్‌ ఔట్‌ చేసినా.. సూపర్‌ బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ గిల్‌ రెండు సిక్స్‌లను బాదాడు. అదే ఊపులో 19వ ఓవర్లో అతడు మరో సిక్స్‌ కొట్టాడు. హర్షల్‌ వేసిన ఆ ఓవర్లో 11 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో టైటాన్స్‌కు 8 పరుగులు అవసరం కాగా.. పార్నెల్‌ మొదట నోబాల్‌, ఆ తర్వాత వైడ్‌ వేశాడు. ఆ తర్వాత సిక్స్‌ దంచిన గిల్‌ జట్టును విజయతీరాలకు చేర్చడంతో పాటు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లాడు.

అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్​గా రికార్డు.. సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో శతకం బాదిన విరాట్.. తాజా మ్యాచ్​లోనూ సెంచరీ కొట్టి.. ఐపీఎల్‌లో 7వ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఈ మెగాలీగ్​లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ సీజన్​లో అతడికి రెండో శతకం కావడం విశేషం. ఈ మ్యాచ్​లో మోహిత్ శర్మ వేసిన 19.1వ బంతికి సింగిల్ తీసి 100 పరుగులు పూర్తి చేసి ఈ ఫీట్​ అందుకున్నాడు.. కేవలం 60 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసిన కోహ్లీ ఇన్నింగ్స్​లో 13 ఫోర్లు, ఓ సిక్స్​ ఉన్నాయి.

అనంతరం 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్​ టైటాన్స్​ ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా 14 బంతుల్లో 2 ఫోర్లు సాయంతో 12 పరుగులు చేసి ఔట్​ అయ్యాడు. సిరాజ్​ బౌలింగ్​లో పార్నెల్​ చేతికి క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇదీ చూడండి:ముంబయిలో రోహిత్​.. సన్​రైజర్స్​లో వివ్రాంత్‌ శర్మ.. డబుల్​ రికార్డ్స్​​

ABOUT THE AUTHOR

...view details