IPL 2023 SRH VS RCB : ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. 19.2 ఓవర్లో 187 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో గెలిచింది. 187 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ స్టార్ బ్యాటర్లు కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్.. ఇద్దరే కలిసి దాదాపుగా పూర్తిచేశారు. కోహ్లీ(63 బంతుల్లో 100; 12x4,4x6) శతక్కొట్టాడు. ఫాఫ్ డుప్లెసిస్(47 బంతుల్లో 71; 7x42x6) ధనాధన్ బ్యాటింగ్ ఆడాడు. అయితే దూకుడుగా ఆడుతున్న కోహ్లీ, డుప్లెసిస్‌ను చివర్లో.. వరుస ఓవర్లలో మూడు బంతుల తేడాతో పెవిలియన్‌కు పంపారు సన్‌రైజర్స్ బౌలర్లు. విరాట్‌ను 17.5ఓవర్లలో భువనేశ్వర్ పెవిలియన్ పంపగా.. డుప్లెసిస్‌ను 18.2ఓవర్లో నటరాజన్ ఔట్ చేశాడు. ఇక చివర్లో వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, మైఖెల్ బ్రాస్‌వెల్ మిగతా లక్ష్యాన్ని పూర్తి చేశారు.
IPL 2023 SRH VS RCB : కోహ్లీ, డుప్లెసిస్ విధ్వంసం.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం - kohli century rcb playoffs
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. సన్‌రైజర్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో కోహ్లీ, డుప్లెసిస్ కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. జట్టుకు విజయాన్ని అందించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. భారీ స్కోరు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (104; 51 బంతుల్లో 8x4, 6x6) సెంచరీ బాదడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (27* 2x4,1x6), అభిషేక్ శర్మ (14 బంతుల్లో 11; 2x4), రాహుల్ త్రిపాఠి (12 బంతుల్లో 15; 2x4, 1x6), మార్క్రమ్ (20 బంతుల్లో 18) రాణించారు. బెంగళూరు బౌలర్లలో బ్రాస్‌వెల్ 2 వికెట్లు పడగొట్టగా.. షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలను బ్రాస్‌వెల్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన మార్క్రమ్తో కలిసి హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్‌ను ఝళిపించిన అతడు ఫోర్లు, సిక్స్‌లు బాదాడు. 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న అతడు.. తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ.. 49 బంతుల్లోనే సెంచరీ బాదాడు. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్లో మూడో బంతికి సిక్స్ బాది మూడంకెల స్కోరును శతకాన్ని అందుకున్నాడు. అదే ఓవర్లో ఐదో బంతికి భారీ షాట్ ఆడేందుకు యత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్ ఆశించినంత వేగంగా ఆడకపోవడం వల్ల.. సన్‌రైజర్స్ 186 పరుగులకు పరిమితం కావాల్సి వచ్చింది.
ఇదీ చూడండి:IPL 2023 SRH VS RCB : హెన్రిచ్ సెంచరీ.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం