IPL 2023 CSK vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు.. కోల్‌కతా షాక్ ఇచ్చింది. CSKను వారి సొంత మైదానంలో 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో కోల్‌కతా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. అయితే వాస్తవానికి ఈ ప్లేఆఫ్స్ చేరడం చాలా కష్టమే అయినా.. ఆరో విజయంతో సాంకేతికంగానైనా తన అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. స్పిన్నర్లు నరైన్, వరుణ్.. బ్యాటర్లు రింకూ సింగ్, నితీశ్ రాణాల చక్కని ప్రదర్శనతో చెన్నైను కోల్‌కతా ఓడించింది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే చెన్నై ప్లేఆఫ్స్ చేరేది. అయితేనే ఓడినప్పటికీ రేసులో చాలా ముందుంది.
చెన్నై నిర్దేశించిన 145 సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆది నుంచి తడబడింది. ఓ దశలో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ జేసన్ రాయ్ (12) పరుగులకే పెవిలియన్ చేరగా.. గుల్భాజ్ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ కూడా ఆకట్టుకోలేక పోయాడు. 4 బంతులు ఎదుర్కొని 9 పరుగులతే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత దిగిన నితీశ్ రాణా (50), రింకూ సింగ్ (54) అద్భుత ప్రదర్శన చేసిKKRను ఆదుకున్నారు.18వ ఓవర్లలోనే KKR లక్ష్యాన్ని చేధించింది. CSK బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు పడగొట్టాడు.