IPL 2023 MI vs CSK : ఐపీఎల్ 2023లో భాగంగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబయి నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 6 వికెట్ల తేడాతో ముంబయిపై విజయం సాధించింది. 17.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఛేసింగ్ పూర్తి చేసింది. మొదటి నుంచి చెన్నై జట్టు ఆధిపత్యం కనబర్చింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (30), డేవన్ కాన్వే (44) అదరగొట్టారు. అంబటి రాయుడు (12) తడబడగా.. అజింక్య రహానే (21) ఫర్వాలేదనిపించాడు. శివమ్ దుబే (26*), ధోనీ ( 2*)పరుగులు చేశాడు. ఇక, ముంబయి బౌలర్లలో పీయుశ్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. ఆకాశ్ మధ్వల్, స్టబ్స్ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు.. స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరగులు చేసింది. మొదటి నుంచి ముంబయి తడబడింది. ఓపెనర్లు కామెరూన్ గ్రీన్ (6), ఇషాన్ కిషన్ (7) పేలవ ప్రదర్శన చేశారు. ఆ తర్వాత వచ్చిన రోహిత్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి దిగిన నేహల్ వధేరా (64) జట్టును కాపాడాడు. 8 ఫోర్లు ఒక సిక్స్‌తో చెలరేగిపోయాడు. అతడు ఔట్ అయిన తర్వాత సూర్య కుమార్ యూదవ్ (26), స్టబ్స్ (20) ఫర్వాలేదనిపించారు. టిమ్ డేవిడ్ (2), అర్షద్ ఖాన్ (1) జోఫ్రా ఆర్చర్ (3*), చావ్లా (2*) పరుగులు చేసి వెనుదిరిగారు. ఇక, చెన్నై బౌలర్లలో మతీశ పతిరణ (3) వికెట్లతో చెలరేగిపోయాడు. చాహర్, తుశార్ దేశ్‌పాండే రెండు చొప్పున వికెట్లు తీశారు. జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.