ఐపీఎల్ 16వ సీజన్లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకునే ట్రెండ్ కొనసాగుతుందనే చెప్పాలి. రీసెంట్గా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై కేవలం 127 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని రాయల్ ఛాలెంజర్ బెంగళూరు గెలిస్తే.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ 130 పరుగులే చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ నిర్దేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా దిల్లీ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో ఆడియన తొమ్మిదిమ్యాచ్ల్లో మూడో విజయంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా చెేసుకుంది.
లక్ష్యఛేధనలో గుజరాత్లో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(0) ఆరు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (6) పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన హార్దిక్ పాండ్య (59 నాటౌట్; 53 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ పూర్తి చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్ (6), డేవిడ్ మిల్లర్ (0) పేలవ ప్రదర్శన చేశారు. అనంతరం అభినవ్ మనోహర్ నిలకడగా ఆడి (26) ఫర్వాలేదనిపించాడు. అభినవ్ మనోహర్ (26; 33 బంతుల్లో 1×6), రాహుల్ తెవాతియా (20) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో ఖలీద్ అహ్మద్ (2/24) వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ (2/23), నోకియా (1), కుల్దీప్ యాదవ్(1/15) వికెట్లు పడగొట్టి టైటాన్స్‌ను దెబ్బతీశారు.