సాధారణంగా మ్యాచ్ ఆడేటప్పుడు ధోనీ ఎంత ప్రశాంతంగా ఉంటాడో అందరికే తెలిసిందే. అందుకే అతడిని మిస్టర్ కూల్ అని కూడా అంటుంటారు. కానీ తాజాగా అతడు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో కాస్త అసహనానికి గురయ్యాడు. సాధారణంగా మ్యాచ్‌లో మహీ రివ్యూ తీసుకున్నాడంటే చాలా సందర్భాల్లో ఫలితం అనుకూలంగానే వస్తుంది. మాస్టర్‌మైండ్‌తో ఆలోచించే మహీ రివ్యూ విషయంలో ఎంతో ఫర్‌ఫెక్ట్‌గా ఉంటాడు. కానీ ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలిసారి అతడి లెక్క తప్పినట్టుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహీ.. యశస్వి జైశ్వాల్ విషయంలో రివ్యూకు వెళ్లగా.. అంపైర్ మహీకి అనకూలమైన తీర్పు ఇవ్వలేదు.
తీక్షణ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతిని.. జైశ్వాల్ స్వీప్ ఆడే ప్రయత్నం చేసి బాల్‌ను మిస్ చేశాడు. ఈ క్రమంలోనే బాల్ అతడి ప్యాడ్లను తాకి కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్లింది. అప్పుడు అంపైర్‌కు అప్పీల్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మహీ డీఆర్‌ఎస్ కోరాడు. అయితే డీఆర్ఎస్లో.. అల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్లను తాకినప్పటికీ లెగ్‌స్టంప్ ఔట్‌సైడ్‌లో బంతి పిచ్ అయినట్లు చూపించింది. దీంతో జైశ్వాల్ నాటౌట్ అని తేలింది. సీఎస్కే ఒక రివ్యూను కోల్పోయింది. అయితే అప్పటికే జైశ్వాల్ ధాటిగా ఆడడంతో.. ఓ దశలో తమ బౌలర్లపై ధోనీ అసహనం కూడా వ్యక్తం చేశాడు.