ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములకు నెలవుగా ఉంటున్న కోల్‌కతా జట్టు ఎట్టకేలకు ఆ పరాజయ పరంపరకు తెరదించింది. బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో విజయాన్న అందుకుంది. నితీశ్ రాణా, జేసన్ రాయ్ లాంటి ఆటగాళ్ల మెరుపులతో మొదట కోల్‌కతా 5 వికెట్లకు 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ, విజయ్‌కుమార్ వైశాఖ్ రాణించారు. ఇక ఛేదనలో విరాట్ కోహ్లి, లొమ్రార్ సత్తా చాటినప్పటికీ.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడం వల్ల బెంగళూరుకు ఓటమి తప్పలేదు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లకు 179 పరుగులే స్కోర్ చేయగలిగింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' వరుణ్ చక్రవర్తి, సుయాశ్, రసెల్ ఆ జట్టును దెబ్బ తీశారు. దీంతో 8 మ్యాచ్‌ల్లో కోల్‌కతాకు మూడో విజయం కాగా.. బెంగళూరు మాత్రం నాలుగో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది.
సొంత గడ్డపై కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌ల బ్యాటింగ్ ఆర్డర్‌కు ఛేదన కష్టం కాదనే అనుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్.. 200 పైన స్కోర్ సాధించడం అంతే ఇక ఈజీ అనే అనుకున్నారు. కానీ ఈ ముగ్గురిలో ఇద్దరు చేతులెత్తేయడంతో ఆ జట్టుకు ఆదిలోనే దారులు మూసుకుపోయినట్లయింది. రెండు మెరుపు సిక్సర్లతో ఊపుమీద కనిపించిన డుప్లెసిస్, రాయ్ స్థానంలో 'ఇంపాక్ట్ ప్లేయర్'గా వచ్చిన యువ స్పిన్నర్.. సుయాశ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద రింకు చేతికి చిక్కడం వల్ల బెంగళూరుకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. షాబాజ్ ఎప్పటిలాగే ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అతన్ని కూడా సుయాశే ఔట్ చేశాడు. బెంగళూరుకు అసలైన దెబ్బ మరో స్పిన్నర్ వరుణ్ వేసిన ఆరో ఓవర్లో తగిలింది. మెరుపు వీరుడు మ్యాక్స్‌వెల్ షాట్ గురి తప్పి షార్ట్ కవర్స్‌లో వీజ్‌కు దొరికిపోగా.. ఇక స్టేడియం ఒక్కసారిగా ఉస్సూరుమంది. పవర్‌ప్లేలో స్కోరు 58/3. ఈ దశలో నిలకడగా ఆడుతున్న కోహ్లికి జత కలిసిన లొమ్రార్.. మ్యాక్సీ లోటును భర్తీ చేయడానికి చూశాడు. ఈ క్రమంలో ఒకానొక దశలో తాను ఎదుర్కొన్న 7 బంతుల్లో అతను మూడు సిక్సర్లను కూడా బాదాడు. కానీ లొమ్రార్, కోహ్లి వరుస ఓవర్లలో వెనుదిరగడంతో ఆ జట్టు పనైపోయింది. కోహ్లి క్యాచ్‌ను మిడ్‌వికెట్‌లో పక్కకు పరుగెట్టిన వెంకటేశ్.. డైవ్ చేసి ఆ బాల్‌ను చక్కగా ఆ తర్వాత కార్తీక్ కాసేపు నిలబడ్డా అద్భుతాలేమీ చేయలేకపోయాడు. దీంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.