ఐపీఎల్ 2023లో భాగంగా జరుగుతున్న 34 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది దిల్లీ క్యాపిటల్స్. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. మనీష్ పాండే(34), అక్సర్ పటేల్(34) టాప్ స్కోరర్. కెప్టెన్ వార్నర్(21), మిచెల్ మార్ష్(25) నామమాత్రపు పరుగులు చేశారు. మిగతా వారు విఫలమయ్యారు. మొత్తం ఆ జట్టులో ఏకంగా ముగ్గురు రనౌట్ అయ్యారు. 8 ఓవర్లకు 62/5తో కష్టాల్లో పడిన దిల్లీకి అక్షర్ పటేల్, మనీశ్ పాండే అండగా నిలిచారు. వీరిద్దరు నిలకడగా సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ ఆడకపోయి ఉండే దిల్లీ క్యాపిటల్స్ మరింత తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో మెరిశాడు. భువనేశ్వర్ కుమార్ 2, టి నటరాజన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
రెండో బౌలర్‌గా రికార్డు..ఈ మ్యాచ్‌లో సర్‌రైజర్స్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో బ్యాటర్లను అత్యధిక సార్లు డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. పృథ్వీ షాను పక్కనబెట్టిన దిల్లీ క్యాపిటల్స్.. ఫిలిప్ సాల్ట్‌ను ఓపెనర్‌గా పంపింది. అతడు భువీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసిన్‌కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అలా ఫిల్ సాల్ట్‌ను డకౌట్ చేసిన భువీ.. తాజా ఫీట్‌ను అందుకున్నాడు. ఈ మెగాటోర్నిలో అతడు ఇప్పటివరకు 25 మంది బ్యాటర్లను డకౌట్ చేశాడు. ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల లిస్ట్‌లో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగా(36) అగ్ర స్థానంలో ఉన్నాడు.