తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​కు దెబ్బమీద దెబ్బ.. ఆల్​రౌండర్ మళ్లీ దూరం! - వాషింగ్టన్ సుందర్ గాయం

Washington Sundar injury: సన్​రైజర్స్ ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ జట్టుకు దూరం కానున్నాడు! సీఎస్కేతో జరిగిన మ్యాచ్​లో గాయపడ్డ సుందర్.. దిల్లీతో మ్యాచ్​కు అందుబాటులో ఉండటంపై సందేహాలు ఏర్పడ్డాయి. ఈ విషయంపై టామ్ మూడీ వివరణ ఇచ్చారు.

washington sundar injury
washington sundar injury

By

Published : May 2, 2022, 7:31 PM IST

Washington Sundar injury: రెండు వరుస ఓటములతో డీలా పడ్డ సన్​రైజర్స్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్​రౌంటర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ గాయపడ్డాడు. ఇదివరకే గాయంతో మూడు మ్యాచ్​లకు దూరమయ్యాడు ఈ ప్లేయర్. తాజా గాయంతో మరోసారి జట్టుకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్​లో ఫీల్డింగ్ చేస్తుండగా సుందర్ గాయపడ్డాడు. బౌలింగ్ చేసే చేతికే గాయం కావడం వల్ల.. మ్యాచ్​లో సన్​రైజర్స్​పై తీవ్ర ప్రభావం పడింది. పార్ట్​ టైమ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. చివర్లో బ్యాటింగ్​కు వచ్చినప్పటికీ.. రెండు బంతులు ఆడి పెవిలియన్ చేరాడు సుందర్.

IPL 2022 Washington Sundar: కాగా, ఇదివరకు గాయం అయిన చోటే సుందర్​కు ఇప్పుడు మళ్లీ గాయమైందని సన్​రైజర్స్ కోచ్ టామ్ మూడీ తెలిపాడు. గత గాయం నుంచి సుందర్ పూర్తిగా కోలుకున్నాడని చెప్పాడు. అయితే దాన్ని తిరగబెట్టే స్థాయిలో ప్రస్తుత గాయం లేదని స్పష్టం చేశాడు. కుట్లు వేయాల్సిన అవసరం లేకపోవచ్చని అన్నాడు. అయితే, అతడు బౌలింగ్ చేసే పరిస్థితుల్లో కూడా లేడని బాంబు పేల్చాడు. అతడు లేకపోవడం తమకు తీరని లోటు అని చెప్పుకొచ్చాడు. సన్​రైజర్స్ తన తర్వాతి మ్యాచ్​ను దిల్లీతో ఆడనుంది. మూడీ వ్యాఖ్యలను బట్టి ఈ మ్యాచ్​కు సుందర్ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:IPL 2022: ఆ లెక్క దాటాలంటే లక్ ఉండాలి బాసూ!

ABOUT THE AUTHOR

...view details