Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 13 సీజన్లలో (2010 నుంచి 2022 వరకు) 300ల పైచిలుకు పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత దక్కించుకున్నాడు విరాట్.
బెంగళూరు తరఫున 7000: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ (73; 54 బంతుల్లో 8x4, 2x6) విజృంభించాడు. కవర్ డ్రైవ్‌లు, ఫ్లిక్ షాట్లలాంటి చూడచక్కని బ్యాటింగ్‌తో మళ్లీ తనలోని మునుపటి ఆటగాడిని గుర్తుచేశాడు. దీంతో బెంగళూరు జట్టే కాకుండా అతడి అభిమానులు కూడా మురిసిపోయారు. ఈ మ్యాచ్‌తో విరాట్ మరో అరుదైన రికార్డూ నెలకొల్పాడు కోహ్లీ. బెంగళూరు ఫ్రాంఛైజీ తరఫున 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.