IPL 2022: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సత్తా చాటింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబయిపై హైదరాబాద్ 3 పరుగుల తేడాతో గెలిచింది. ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ (48), ఇషాన్ కిషన్ (43), టిమ్ డేవిడ్ (46) ధాటిగా ఆడటం వల్ల ఓ దశలో ముంబయి గెలిచేలా కనిపించింది. అయితే భువనేశ్వర్ కుమార్ (1/26), ఉమ్రాన్ మాలిక్ (3/23) పొదుపుగా బౌలింగ్ చేయడం వల్ల హైదరాబాద్ విజయం సాధించింది. మిగతా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు. టి. నటరాజన్ (0/60) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
IPL 2022: సత్తా చాటిన సన్‌రైజర్స్.. ఉత్కంఠ పోరులో ముంబయిపై గెలుపు
IPL 2022: వరుసగా ఐదు ఓటముల తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్ విజయం సాధించింది. ముంబయిపై 3పరుగుల తేడాతో గెలిచింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో ముంబయికి 194 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. రాహుల్ త్రిపాఠి (76) అర్ధశతకం సాధించగా.. ప్రియమ్ గార్గ్ (42), నికోలస్ పూరన్ (38) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లలో అభిషేక్ శర్మ 9, మార్‌క్రమ్ 2 కేన్ విలియ్సన్ 8*, సుందర్ 9 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో రమణ్‌దీప్ 3.. డానియల్ సామ్స్, రిలే మెరిడెత్, బుమ్రా తలో వికెట్ తీశారు. టీ20 ఫార్మాట్‌లో బుమ్రా 250 వికెట్లను తీసిన బౌలర్‌గా అవతరించాడు.
ఇదీ చదవండి:IPL 2022: దిల్లీ ప్లేఆఫ్ ఆశలు సజీవం.. పంజాబ్‌పై విజయం