IPL 2022: టీ20 మెగా టోర్నీలో లఖ్‌నవూ మరో విజయం సాధించింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 157/9 స్కోరుకే పరిమితమైంది. లఖ్‌నవూకిది రెండో విజయం కాగా.. హైదరాబాద్‌కిది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.
IPL 2022: ఎస్ఆర్హెచ్పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఘన విజయం - ipl live score
IPL 2022: ఎస్ఆర్హెచ్పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. లఖ్‌నవూ జట్టులో ఆవేశ్ ఖాన్(4), జాసన్ హోల్డర్(3) బౌలింగ్‌లో అదరగొట్టారు.
హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి (44 : 30 బంతుల్లో 5×4, 1×6), నికోలస్ పూరన్ (34 : 24 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. వాషింగ్టన్ సుందర్ (18), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (16), ఓపెనర్ అభిషేక్ శర్మ (13), మార్‌క్రమ్ (12) పరుగులు చేశారు. భువనేశ్వర్ కుమార్ (1) పరుగు చేయగా.. అబ్దుల్ సమద్ (0) డకౌటయ్యాడు. ఆఖరు బంతికి రోమెరియో షెఫర్డ్ (8) క్యాచ్ ఔటయ్యాడు. లఖ్‌నవూ బౌలర్లలో అవేశ్ ఖాన్ నాలుగు, జేసన్ హోల్డర్ మూడు, కృనాల్ పాండ్య రెండు వికెట్లు పడగొట్టారు.
ఇదీ చదవండి:20 ఏళ్లకే ప్రపంచ నెం.1.. తొలి క్రీడాకారిణిగా రికార్డు!