IPL 2022: టీ20 లీగ్‌లో హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. కోల్‌కతాపై గెలిచి వరుసగా మూడో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 175 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో 176 పరుగులు చేసి విజయం సాధించింది. రాహుల్ త్రిపాఠి (71), మార్‌క్రమ్ (68*) అర్ధశతకాలతో హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కేన్ విలియమ్సన్ 17, అభిషేక్ శర్మ 3, నికోలస్ పూరన్ 5* పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ 2, ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీశారు.
IPL 2022: హైదరాబాద్ హ్యాట్రిక్ విన్.. మెరిసిన త్రిపాఠి, మార్‌క్రమ్ - srh vs kkr
IPL 2022: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన జోరును కొనసాగిస్తోంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. హైదరాబాద్‌కు 176 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. నితీశ్ రాణా (54), ఆండ్రూ రస్సెల్ (49నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (28) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్ మాలిక్ 2.. భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్‌సెన్, సుచిత్ తలో వికెట్ తీశారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీస్తూ కోల్‌కతా బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో హైదరాబాద్ బౌలర్లు విజయవంతమయ్యారు. అయితే ఆఖర్లో రస్సెల్ దూకుడుగా ఆడటంతో కోల్‌కతా 175 పరుగులు చేసి.. మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇదీ చదవండి:IPL 2022: దిల్లీ క్యాపిటల్స్‌లో కరోనా కలకలం