IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 162/7 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (50*) అర్ధ శతకంతో చెలరేగాడు. అభినవ్ మనోహర్ (35) రాణించాడు. ఓపెనర్ మ్యాథ్యూ వేడ్ (19)ఫర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌ల్లో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్ (7) ఈసారి నిరాశపరిచాడు.
హార్దిక్ రికార్డు.. హాఫ్‌సెంచరీతో అదుర్స్.. సన్‌రైజర్స్ లక్ష్యం ఎంతంటే? - ipl live score
IPL 2022: సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య. దీంతో హైదరాబాద్‌కు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టైటాన్స్.
IPL 2022
హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 2, నటరాజన్ 2, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు.
హార్దిక్ రికార్డు:ఐపీఎల్లో అరుదైన రికార్డు సాధించాడు హార్దిక్ పాండ్య. ఈ లీగ్ అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మైలురాయి చేరుకునేందుకు పాండ్య 1046 బంతులను ఎదుర్కొన్నాడు. ఈ జాబితాలో రసెల్ (657 బంతులు) అగ్ర స్థానంలో ఉండగా, గేల్ (943 బంతులు) తర్వాతి స్థానంలో ఉన్నాడు.