తెలంగాణ

telangana

ETV Bharat / sports

SRHvsLSG: లఖ్​నవూ జోరుకు బ్రేక్ పడేనా? సన్​రైజర్స్​ బోణీ కొట్టేనా? - ఐపీఎల్​ వార్తలు

IPL 2022: మెగా టీ20 లీగ్​ ఐపీఎల్​ను ఓటమితో ప్రారంభించిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ రెండో పోరుకు సిద్ధమైంది. లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో సోమవారం తలపడనుంది. అయితే.. డిఫెండింగ్​ ఛాంపియన్​ చెన్నైకి షాక్​ ఇచ్చి జోరు మీద ఉన్న లఖ్​నవూను హైదరాబాద్​ నిలువరించి బోణీ కొడుతుందా?

IPL 2022
సన్​రైజర్స్​ హైదరాబాద్​

By

Published : Apr 4, 2022, 1:46 PM IST

IPL 2022: ఐపీఎల్​ 2022 సీజన్​లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్​ను పేలవమైన ప్రదర్శనతో ప్రారంభించిన సన్​రైజర్స్​ హైదరాబాద్​.. ఆడిన రెండో మ్యాచ్​లోనే అదరగొట్టిన లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో సోమవారం తలపడనుంది. చెన్నై నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఊపు మీదున్న లఖ్​నవూను హైదరాబాద్​ అడ్డుకోగలదా? ఇరు జట్ల బలాబలాలేమిటి?

బోణీ కోసం సన్​రైజర్స్​: ఐపీఎల్​ 2022లో బోణీ కొట్టాలని చూస్తోంది సన్​రైజర్స్​ హైదరాబాద్. తొలి మ్యాచ్​లో ఘోర పరాభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో లఖ్​నవూపై విజయం సాధించాలని భావిస్తోంది. మొదటి మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ చేతిలో 61 పరుగుల తేడాదో ఓటమి చెందింది​. భువనేశ్వర్​ కుమార్​ కాస్త పొదుపుగా బౌలింగ్​ చేసినా.. మిగతా బౌలర్లు ఉమ్రాన్​ మాలిక్​, నటరాజన్​, వాషింగ్టన్​ సుందర్​ భారీగా పరుగులు సమర్చించుకోవటం ఆందోళన కలిగించే విషయమే. రానున్న మ్యాచుల్లో తమ బౌలింగ్​ మెరుగుపడుతుందని సన్​రైజర్స్​ మేనేజ్​మెంట్​ ఆశాభావంతో ఉంది. మరోవైపు.. బ్యాటింగ్​లోనూ పేలవ ప్రదర్శన జట్టును కలవరపెడుతోంది. కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​, రాహుల్​ త్రిపాఠి, నికోలస్​ పూరన్​, అబ్దుల్​ సమద్​, అభిషేక్​ శర్మతో పటిష్ఠంగానే కనిపిస్తున్నా ప్రదర్శనలో అంతంత మాత్రంగానే ఉంది. ఐపీఎల్​ 2022లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ బోణీ కొట్టాలంటే ఆల్​రౌండ్​ ప్రదర్శన అవసరమని పలువురు క్రికెట్​ నిపుణులు భావిస్తున్నారు.

జోరు మీద లఖ్​నవూ:అరంగేట్ర సీజన్​ను ఓటమితో ప్రారంభించిన లఖ్​నవూ రెండో మ్యాచ్​లో అద్భుత ప్రదర్శనతో ట్రాక్​లోకి వచ్చింది. తనకు ఉన్న బ్యాటింగ్​ బలంతో సోమవారం హైదరాబాద్​తో జరిగే మ్యాచ్​లో గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసేందుకు తహతహలాడుతోంది. తొలిమ్యాచ్​లో గుజరాత్​ టైటన్స్​ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది లఖ్​నవూ. కానీ, రెండో మ్యాచ్​లో డిఫెండింగ్​ ఛాంపియన్ చెన్నైకి షాకిస్తూ భారీ స్కోర్​ను సైతం ఊదేసింది. కెప్టెన్​ కేఎల్​ రాహుల్​, ఓపెనర్​ క్వింటాన్​ డికాక్​ మంచి ఫామ్​లో ఉన్నారు. సీఎస్కేపై తొలివికెట్​కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వెస్టిండీస్​ బ్యాటర్​ ఎవిన్​ లేవిస్​ 23 బంతుల్లోనే 55 పరుగులు చేసి భారీ స్కోర్​ను ఛేదించటంలో కీలక పాత్ర పోషించాడు. మిడిల్​ ఆర్డర్​లో దీపక్​ హూడా జట్టుకు బలమయ్యాడు. యువ ఆటగాడు ఆయుష్​ బదోని సైతం రెండు మ్యాచుల్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

బోలింగ్​ విభాగంలో ఆవేశ్​ ఖాన్​, శ్రీలంక ఆటగాడు దుష్మంత చమీరా, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్​ జరిగిన రెండు మ్యాచుల్లో వికెట్లు పడగొట్టారు. అయితే.. వారు ఎక్కువగా పరుగులు ఇవ్వటం లఖ్​నవూ జట్టును కలవరపెడుతోంది. పరుగులను కట్టడి చేస్తూ వికెట్లు పడగొడితే వారికి ఎదురే ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.

లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​:కేఎల్​ రాహుల్​(కెప్టెన్​), మనన్​ వోహ్రా, ఎవిన్​ లేవిస్​, మనీశ్​ పాండే, క్వింటాన్​ డికాక్​, రవి బిష్ణోయ్​, దుష్మంత చమీరా, షాబాజ్​ నదీమ్​, మోసిన్​ ఖాన్​, మాయంగ్​ యాదవ్​, అంకిత్​ రాజ్​పుత్​, అవేశ్​ ఖాన్​, ఆండ్రూ టై, మార్కస్​ స్టోయినిస్​, కైల్​ మేయర్స్​, కరన్​ శర్మ, క్రిష్ణప్ప గౌతమ్​, ఆయుష్​ బదోని, దీపక్​ హుడా, కృనాల్​ పాండ్య, జసన్​ హోల్డర్​.

సన్​రైజర్స్​ హైదరాబాద్​:కేన్​ విలియమ్సన్​(కెప్టెన్​), అభిషేక్​ శర్మ, రాహుల్​ త్రిపాఠి, ఐదెన్​ మార్​క్రమ్​, నికోలస్​ పూరన్​, అబ్దుల్​ సమద్​, ప్రియమ్​ గార్గ్​, విష్ణు వినోద్​, గ్లేన్​ ఫిలిప్స్​, ఆర్​ సమర్థ్​, శశాంక్​ సింగ్​, వాషింగ్టన్​ సుదర్​, రొమారియో షెపార్డ్​, మార్కో జన్సెన్​, జే సుచిత్​, శ్రేయస్​ గోపాల్​, భువనేశ్వర్​ కుమార్​, సీన్​ అబ్బాట్​, కార్తిక్​ త్యాగి, సౌరబ్​ తివారి, ఫాజల్హాక్​ ఫరూకి, ఉమ్రాన్​ మాలిక్​, టీ నటరాజన్​.

ఇదీ చూడండి:'హైదరాబాద్​ అభిమానులు ఫుల్​ కుష్​'.. చెన్నైపై నెటిజన్ల సెటైర్లు!

ABOUT THE AUTHOR

...view details