నామమాత్రమైన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. బ్యాటింగ్‌లో మోస్తరు ప్రదర్శన చేసిన హైదరాబాద్.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఆఖరి మ్యాచ్‌లో క్యాచ్‌ల డ్రాప్‌లతో చేజేతులా ఓటమిపాలైంది. టీ20 మెగా టోర్నీ చివరి లీగ్ దశ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో పంజాబ్ టోర్నీని ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 157/8 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కేవలం 15.1 ఓవర్లలో 160 పరుగులు చేసి గెలుపొందింది. లియామ్ లివింగ్‌స్టోన్ (49*), శిఖర్ ధావన్ (39), జానీ బెయిర్‌స్టో (23), షారుఖ్ ఖాన్ (19), జితేశ్ శర్మ (19) రాణించారు. లియామ్‌స్టోన్ ఇచ్చిన నాలుగు క్యాచ్‌లను హైదరాబాద్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఫరూఖి 2.. సుందర్, సుచిత్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ తీశారు.
సన్‌రైజర్స్ చిత్తు.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ విజయం - undefined
ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. హైదరాబాద్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
![సన్‌రైజర్స్ చిత్తు.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ విజయం IPL 2022 SRH vs PBKS match result](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15358440-thumbnail-3x2-asdf.jpg)
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. ఓ మోస్తరు స్కోరు నమోదు చేసింది. ప్రియమ్ గార్గ్ (4), నికోలస్ పూరన్ (5) విఫలం కాగా.. అభిషేక్ శర్మ (43), రాహుల్ త్రిపాఠి (20), మార్‌క్రమ్ (21), వాషింగ్టన్ సుందర్ (25), రొమారియో షెఫెర్ట్ (26*) రాణించారు. సుందర్-షెఫెర్ట్ ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అయితే పంజాబ్ బౌలర్ల దెబ్బకు మిడిల్, చివర్లో స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకోవడంతో హైదరాబాద్ అనుకున్నంత స్కోరును సాధించలేకపోయింది. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, హర్‌ప్రీత్ బ్రార్ 3, కగిసో రబాడ ఒక వికెట్ తీశారు.