IPL 2022 SRH Vs GT: ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 19.1 ఓవర్లలో వికెట్లు కేవలం 2 కోల్పోయి ఛేదించింది. 163 పరుగుల లక్ష్యంతో దిగిన సన్‌రైజర్స్ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ(42) మెరిశాడు. మరో ఓపెనర్ కేన్ విలియమ్సన్(57) అర్ధ శతకంతో చెలరేగాడు. రాహుల్ త్రిపాఠీ (17) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. బ్యాటర్లు నికోలస్ పూరన్(34), మార్క్రమ్(12) నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, హార్దిక్ పాండ్య తలో వికెట్ పడగొట్టారు.
IPL 2022: చెలరేగిన కేన్ మామ.. సన్‌రైజర్స్ ఘన విజయం - ఐపీఎల్
IPL 2022 SRH Vs GT: ఐపీఎల్ 2022 సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జట్టుకి హైదరాబాద్ షాకిచ్చింది. ఆ జట్టుపై సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ విలియమ్సన్ అర్ధ శతకంతో చెలరేగాడు.
IPL 2022 SRH VS GT
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 162/7 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (50*) అర్ధ శతకంతో చెలరేగాడు. అభినవ్ మనోహర్ (35) రాణించాడు. ఓపెనర్ మ్యాథ్యూ వేడ్ (19)ఫర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌ల్లో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్ (7) ఈసారి నిరాశపరిచాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 2, నటరాజన్ 2, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు
ఇదీ చదవండి: టీమ్ఇండియాకు అతడు 100 టెస్టులు ఆడేలా చేస్తా: పాంటింగ్
Last Updated : Apr 11, 2022, 11:29 PM IST