IPL 2022: తన బౌలింగ్‌లో వేగం సహజంగా వస్తుందని హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తెలిపాడు. 22 ఏళ్ల ఉమ్రాన్ ప్రస్తుత టోర్నీలో ప్రతి మ్యాచ్‌లో 145-150 కిమీ వేగంతో నిలకడగా బంతులు సంధిస్తున్నాడు. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్ కచ్చితంగా టీమ్‌ఇండియాకు ఆడతాడంటూ దిగ్గజ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
"వేగం నాకు సహజంగా వస్తుంది. ఈ ఏడాది సరైన ప్రాంతాల్లో బంతుల్ని సంధించడంపై దృష్టిసారించా. నేనెప్పుడూ వేగంగా బౌలింగ్ చేస్తా. ఈ విషయంలో నాకు నేనే ఆదర్శం. మాకు శిక్షణ ఇచ్చేందుకు ఇర్ఫాన్ పఠాన్ వచ్చినప్పుడు నేను బౌలింగ్ చేస్తూ ఎక్కువగా ఎగిరేవాడిని. స్థిరత్వం ఉండేది కాదు. సరైన ప్రాంతాల్లో నిలకడగా బంతులు సంధించేవాడిని కాదు. పఠాన్ వచ్చాక బంతి విసిరే సమయంలో దూకడం తగ్గింది. సరైన లయ దొరకబుచ్చుకున్నా. బాగా ఆడి జమ్ముకశ్మీర్, దేశం గర్వించేలా చేయాలని కోరుకుంటున్నా. నా తల్లిదండ్రులు మొదట్నుంచీ నన్ను ప్రోత్సహించారు. కాస్కో టోర్నీలో రాత్రి 2 గంటల వరకు క్రికెట్ ఆడినా ఏమీ అనేవాళ్లు కాదు. హైదరాబాద్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ వంటి దిగ్గజంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అతని దగ్గర చాలా నేర్చుకుంటున్నా" అని ఉమ్రాన్ వివరించాడు.
ఇవీ చూడండి: