తెలంగాణ

telangana

ETV Bharat / sports

Yuzvendra Chahal: చాహల్‌ తొలి 'హ్యాట్రిక్‌'.. ఆటపట్టించిన సతీమణి - rr vs kkr 2022

Yuzvendra Chahal: కోల్​కతాతో మ్యాచ్​లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. ఈ సందర్భంగా మ్యాచ్​ అనంతరం ఇంటర్వ్యూ చేసిన అతడి సతీమణి ధనశ్రీ సరదాగా ఆటపట్టించింది.

IPL 2022
Yuzvendra Chahal

By

Published : Apr 19, 2022, 1:41 PM IST

Yuzvendra Chahal: కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ అద్భుతం చేశాడు. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, మ్యాచ్‌ అనంతరం అతడి సతీమణి ధనశ్రీ వర్మ ఇంటర్వ్యూ చేస్తూ సరదగా ఆటపట్టించింది. చాహల్‌ డగౌట్‌లోకి రాగా.. గ్యాలరీలో నిల్చున్న ధనశ్రీ తన భర్తను ఇలా ఇంటర్వ్యూ చేసింది.

ధన శ్రీ: నేను బయో బబుల్‌ నుంచి బయటకు వచ్చేశానుగా. నువ్వు ఎలా ఫీలవుతున్నావ్‌..?

చాహల్‌: చాలా అద్బుతంగా ఉంది.

ధన శ్రీ:హ్యాట్రిక్‌ వికెట్లు తీసుకున్నావ్‌.. చాలా సంతోషంగా కన్నిస్తున్నావ్‌..!

చాహల్‌: హా.. తొలి హ్యాట్రిక్‌ కదా అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

Yuzvendra Chahal IPL Wickets: అదే సమయంలో ధనశ్రీ పక్కనే ఉన్న రాజస్థాన్‌ జట్టు ప్రతినిధులు స్పందిస్తూ.. హ్యాట్రిక్ మాత్రమే కాదు.. ఐదు వికెట్లు తీసుకున్నాడు గ్రేట్‌ అంటూ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్‌ జట్టు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

ఇక గత రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ చివరి క్షణాల్లో ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. తొలుత జోస్‌ బట్లర్‌ 103 శతకంతో చెలరేగడంతో రాజస్థాన్‌ 217 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసింది. ఛేదనలో కోల్‌కతా మెదట దూకుడుగా ఆడినా తర్వాత నిరాశపర్చింది. ముఖ్యంగా చాహల్‌ తన స్పిన్‌ మాయాజాలంతో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. 17వ ఓవర్లో అతడు హ్యాట్రిక్‌తో సహా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 5 వికెట్లు సాధించి.. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. చివరికి రాజస్థాన్‌ 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.

ఇదీ చూడండి:ఫించ్​తో​ మాటల యుద్ధం.. భారత క్రికెటర్​పై నెటిజన్ల ఆగ్రహం!

ABOUT THE AUTHOR

...view details