తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: ఉత్కంఠ పోరులో రాజస్థాన్​ చేతిలో దిల్లీ ఓటమి - ఐపీఎల్​ 2022

IPL 2022 RR Vs DC: దిల్లీ క్యాపిటల్స్​పై రాజస్థాన్​ రాయల్స్​ ఘన విజయం సాధించింది. జో బట్లర్​ సెంచరీతో 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసిన రాజస్థాన్​ జట్టు.. దిల్లీని 207 పరుగులకే కట్టడి చేసింది.

IPL 2022 RR Vs DC
IPL 2022 RR Vs DC

By

Published : Apr 22, 2022, 11:35 PM IST

Updated : Apr 23, 2022, 11:49 AM IST

IPL 2022 RR Vs DC: ఆల్​రౌండ్​ ప్రదర్శనతో రాజస్థాన్​ రాయల్స్​ అదరగొట్టింది. రాజస్థాన్​ జట్టు బ్యాట్స్​మెన్​ దిల్లీ బౌలర్లపై విరుచుకుపడగా.. ఛేదనకు దిగిన ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టించారు ఆ జట్టు బౌలర్లు. మొత్తానికి శుక్రవారం జరిగిన మ్యాచ్​లో దిల్లీపై ఘన విజయం సాధించింది రాయల్స్​. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన రాజస్థాన్​ జట్టు.. ప్రత్యర్థిని 207 పరుగులకే కట్టడి చేసింది. స్పిన్నర్లు అశ్విన్​, చాహల్​ సహా ఫాస్ట్​ బౌలర్​ ప్రసిద్ధ్​ కృష్ణా అద్భుతమైన బౌలింగ్​ చేశారు. ఆశ్విన్​ రెండు వికెట్లు, ప్రసిద్ధ్​ కృష్ణా మూడు వికెట్లు పడగొట్టగా.. చాహల్​ ఓ వికెట్ తీశాడు.

అంతకుముందు.. టాస్​ ఓడి బ్యాటింగ్​ దిగిన రాజస్థాన్​ రాయల్స్​ జట్టు కేవలం రెండు వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు చేసింది. జోస్​ బట్లర్​ శతకం 116(65), పడిక్కల్​ హాఫ్​ సెంచరీలతో 54(35) విజృంభించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్​ సంజూ శాంసన్​ కూడా 19 బంతుల్లో 46 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు. ఈ సీజన్​లో బట్లర్​కు ఇది మూడో సెంచరీ.

Last Updated : Apr 23, 2022, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details