IPL 2022: ఐపీఎల్ 2022లో కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు చేతులెత్తేశారు. పంజాబ్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులే చేయగలిగింది. దీంతో బెంగళూరుపై పంజాబ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బెంగళూరు బ్యాటర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (35), రాజత్ పాటిదార్ (26), విరాట్ కోహ్లీ (20) ఫర్వాలేదనిపించారు. డుప్లెసిస్ 10, లామ్రోర్ 6, దినేశ్ కార్తిక్ 11, షాహ్‌బాజ్ 9, హర్షల్ పటేల్ 11* పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో రబాడ 3, రాహుల్ చాహర్ 2, రిషి ధావన్ 2.. బ్రార్, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.
IPL 2022: పంజాబ్ ఆశలు పదిలం.. బెంగళూరుకు తప్పని పరాభవం! - rcb latest match
IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. బెంగళూరుపై 54 పరుగుల తేడాతో గెలిచింది పంజాబ్ కింగ్స్.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుకు పంజాబ్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లియామ్ లివింగ్‌స్టోన్ (70: 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (66: 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసంతో అర్ధశతకాలు సాధించారు. శిఖర్ ధావన్ 21, మయాంక్ అగర్వాల్ 19, జితేశ్ శర్మ 9, హర్‌ప్రీత్ బ్రార్ 7, రిషిధావన్ 7, రాహుల్ చాహర్ 2 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 4, హసరంగ 2.. మ్యాక్స్‌వెల్, షాహ్‌బాజ్ చెరో వికెట్ తీశారు.
ఇదీ చదవండి:ముంబయి, చెన్నై లేకుండానే ప్లే ఆఫ్స్.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారా?