IPL 2022: ఢిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి గెలుపు కోసం నేడు (మంగళవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన బెంగళూరు.. చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై అభిమానులను పూర్తి నిరాశపరచిన చెన్నై.. ఈ సీజన్లో గెలుపు రుచి చూడాలని ఆరాటపడుతోంది. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న ఆర్సీబీని సీఎస్కే ఏమాత్రం కట్టడిచేస్తుందో చూడాలి.
చెన్నై, ఆర్సీబీ హెడ్ టు హెడ్:ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఫేవరెట్‌గా కనపడినా.. హెడ్ టు హెడ్ మాత్రం చెన్నైదే పైచేయి. ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో ఈ జట్లు తలపడగా, చెన్నై 18 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక దాంట్లో ఫలితం తేలలేదు.