Rohit Sharma fined IPL 2022: ఐపీఎల్ మెగా లీగ్ 15వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబయి ఇండియన్స్ ఓడిపోయింది. 12 పరుగుల తేడాతో పరాజయం పొందింది. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించటంలో విఫలమైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మకు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో రూ.24 లక్షలు కోత విధించారు. మిగతా జట్టు సభ్యులకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం(ఏది తక్కువైతే అది) కోత పెట్టారు.
ఐపీఎల్ 15వ సీజన్లో స్లో ఓవర్ రేటు కారణంగా ముంబయికి జరిమానా పడటం ఇది రెండోసారి. అంతకు ముందు ఈ సీజన్లో మార్చి 27న తొలి మ్యాచ్ దిల్లీ క్యాపిటల్స్‌పై ముంబయి ఇండియన్స్ ఆడింది. ఈ మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్‌కు జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో రూ.12 లక్షలు కోత విధించారు.
Rohiths sharma 10 thousand runs:ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. టీ20 క్రికెట్లో 10వేల పరుగులు చేసిన రెండో భారతీయుడిగా.. ఓవరాల్‌గా ఏడో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 15వ సీజన్లో బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు రోహిత్. 16 బంతుల్లో 25 పరుగులు సాధించాడు. రోహిత్ కన్నా ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఓవరాల్గో ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గెయిల్ మొదటి స్థానంలో ఉన్నాడు.
టీ20ల్లో అత్యధిక పరుగుల వీరులు మంచి క్రికెట్ ఆడటం లేదు:పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైన తర్వాత మాట్లాడిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము కొంత కాలంగా మంచి క్రికెట్ ఆడటం లేదని, అందుకే ఓడిపోతున్నామని పేర్కొన్నాడు. 'కొంత కాలంగా మంచి క్రికెట్ ఆడటం లేదు. అందుకే ఓటమి వైపు ఉన్నాం. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌లో మా బౌలర్లపై ఒత్తిడి పెంచింది. తొలి వికెట్‌కే 90-100 మధ్య భాగస్వామ్యం నెలకొల్పగలిగింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై 190 ఛేదించగల లక్ష్యంగా ఊహించాను. జట్టుగా ఏం చేయలేదానిపై ఆత్మపరిశీలన చేసుకుంటాం.' అని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి:'కెప్టెన్సీ ఒత్తిడితోనే ఐపీఎల్లో రోహిత్ శర్మ విఫలం'