IPL 2022 RCB VS LSG: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ అదరగొట్టింది. లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లఖ్‌నవూ.. 163కే పరిమితమైంది. ఆ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ లఖ్‌నవూ ఓపెనర్ డికాక్ మరోసారి విఫలమయ్యాడు. 3 పరుగులకే ఔట్ అయ్యాడు. మనీశ్ పాండే మళ్లీ నిరాశపరిచాడు. రాహుల్ కాసేపు నిలిచినా.. ఆశించిన వేగంతో పరుగులు చేయలేదు. అయితే, ఆ తర్వాత వచ్చిన కృనాల్ పాండ్య, దీపక్ హుడా మెరుగైన భాగస్వామ్యంతో స్కోరు బోర్డును నడిపించారు. అయితే, ఒత్తిడికి వికెట్లు సమర్పించుకున్నారు.
టాస్ బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. దీంతో లఖ్‌నవూకు 182 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ (96) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. లఖ్‌నవూ బౌలర్ హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి స్టొయినిస్ చేతికి చిక్కాడు. డుప్లెసిస్ కాకుండా గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23), షాహ్‌బాజ్ అహ్మద్ (26) దినేశ్ కార్తిక్ (13*) రాణించారు. అనుజ్ రావత్ (4), విరాట్ కోహ్లీ (0), ప్రభు దేశాయ్ (10) విఫలమయ్యారు. లఖ్‌నవూ బౌలర్లలో చమీర 2, జాసన్ హోల్డర్ 2, కృనాల్ పాండ్య ఒక వికెట్ తీశారు.