IPL 2022 Ravindra Jadeja: ఐపీఎల్ 2022ను పేలవ ప్రదర్శనతో ఆరంభించింది డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నైసూపర్ కింగ్స్. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై.. అభిమానులను నిరాశకు గురిచేసింది. టోర్నమెంట్‌కు ముందే ధోనీ నుంచి జట్టు పగ్గాలను అందుకున్నాడు రవీంద్ర జడేజా. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన తర్వాత మ్యాచ్‌లో తలపడనున్న సీఎస్కే ఆటగాళ్లు.. రికవరీ సెషన్లో భాగంగా బాస్కెట్‌బాల్ ఆడుతూ కనిపించారు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకటిగా గుర్తింపు పొందిన జడ్డూ.. తన బాస్కెట్‌బాల్ నైపుణ్యంతో వారెవ్వా అనిపిస్తున్నాడు.
జడ్డూ ఏదైనా చేయగలడు.. వైరల్ అవుతున్న వీడియో - సన్‌రైజర్స్ హైదరాబాద్
IPL 2022 Ravindra Jadeja: ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రవీంద్ర జడేజా.. తనలోని మరో కళను బయటపెట్టాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు.. రికవరీ సెషన్లో సరదాగా గడిపిన చెన్నై ప్లేయర్లు.. జడ్డూ ట్యాలెంట్ చూసి అవాక్కయ్యారు. ఇంతకీ అదేంటంటే..
IPL 2022
చూడకుండా బాల్‌ను షూట్ చేసే ముందు.. జడేజా చేసిన పలు ప్రయత్నాలు అలరిస్తున్నాయి. ఇక పర్ఫెక్ట్గా బాల్‌ను చూడకుండానే షూట్ చేయడం ఆకట్టుకుంటోంది. దీనికి "జడ్డూ ఏదైనా చేయగలడు.." "అందుకే కదా.. సర్ జడేజా అనేది" అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.. అయితే "ముందు కనీసం మ్యాచ్ గెలవండి అంటూ" అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
ఇదీ చూడండి:ధోనీకి షాక్!.. అభ్యంతరకరంగా ఉన్న వీడియో తొలగింపు