rajasthan vs kolkata: రాజస్థాన్ బ్యాటర్లు రెచ్చిపోయారు. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించారు. ఓపెనింగ్‌కు దిగిన జోస్ బట్లర్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి రావడం ఆలస్యం ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఐపీఎల్లో రెండో సెంచరీ(103) నమోదు చేశాడు. వన్‌డౌన్‌లో దిగిన సంజూ శాంసన్ సైతం పరుగుల వరద పారించాడు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐదు వికెట్లు కోల్పోయింది.
కొడితే ఫోర్, లేదంటే సిక్స్ అన్నట్టు సాగింది రాజస్థాన్ ఇన్నింగ్స్. ఓపెనింగ్‌లో వచ్చిన బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ నుంచి బట్లర్ తుఫాను మొదలైంది. ఆ ఓపర్ తొలి బంతికి ఫోర్ బాదిన బట్లర్.. రెండో బంతిని స్టాండ్‌లోకి పంపించాడు. చివరి బంతికి మరో నాలుగు పరుగులు రాబట్టి.. ఆ ఓవర్లో 16 రన్స్ పిండుకున్నాడు. అక్కడి నుంచి పరుగుల ప్రవాహం నిరాటంకంగా కొనసాగింది. ఓ ఎండ్‌లో దేవదత్ పడిక్కల్ ఆచితూచి ఆడుతుంటే.. బట్లర్ మాత్రం తన బ్యాటుకు పని చెప్పాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.