పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (68) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. జోస్ బట్లర్ (30), సంజూ శాంసన్ (23) ధాటిగా ఆడారు. పడిక్కల్ (31) నెమ్మదిగా ఆడినా హెట్మెయిర్ (31) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, రబాడా, రిషి ధావన్ తలో వికెట్ పడగొట్టారు.
IPL 2022: మెరిసిన యశస్వీ, చాహల్.. పంజాబ్‌పై రాజస్థాన్ విజయం - ఐపీఎల్ 2022
IPL 2022: గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్ శనివారం పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. చాహల్ 3 వికెట్లతో చెలరేగగా, ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అర్ధశతకంతో రాణించాడు. దీంతో 6 వికెట్ల తేడాతో రాయల్స్ గెలుపొందింది.
IPL 2022
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో (56) అర్ధశతకంతో పాటు జితేశ్ శర్మ (38*), భానుక రాజపక్స (27), లియామ్ లివింగ్ స్టోన్ (23) ధాటిగా ఆడటం వల్ల పంజాబ్ భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 3.. రవిచంద్రన్ అశ్విన్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు.
ఇదీ చూడండి:17 సిక్స్‌లు, 8 ఫోర్లతో 'స్టోక్స్' వీరబాదుడు.. ఒక్క ఓవర్లోనే 34 పరుగులు