IPL 2022: అరంగేట్రంలోనే ఫైనల్లో అడుగుపెట్టేసింది గుజరాత్ టైటాన్స్. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా చివరి వరకు ఉత్కంఠగా జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. సంజూసేన నిర్దేశించిన 189 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాహా డకౌట్‌గా వెనుతిరగగా.. గిల్ (35), మ్యాథ్యూ వేడ్ (35) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. హార్దిక్ (40), డేవిడ్ మిల్లర్ (68) లక్ష్యాన్ని పూర్తి చేశారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు.
IPL 2022: అరంగేట్రంలోనే ఫైనల్‌కు గుజరాత్.. రాజస్థాన్‌పై గెలుపు - gujarat titans vs rajasthan royals qualifier 1
IPL 2022: ఐపీఎల్ 2022లో అరంగేట్రంలోనే ఫైనల్ చేరింది గుజరాత్ టైటాన్స్. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది.

Rajasthan Royals VS Gujarat titans
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. ఓపెనర్ జోస్ బట్లర్ (89) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 188/6 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (47), దేవదత్ పడిక్కల్ (28) ఫర్వాలేదనిపించారు. యశస్వి జైస్వాల్ 3, హెట్‌మయిర్ 4, రియాన్ పరాగ్ 4, అశ్విన్ 2* పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో షమీ, దయాల్, సాయికిశోర్, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.