తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీకి షాక్​!.. అభ్యంతరకరంగా ఉన్న వీడియో తొలగింపు - ధోనీ

MS Dhoni: టీమ్​ఇండియా మాజీ సారథి ఎంఎస్​ ధోనీకి షాక్! ఐపీఎల్​ 2022 కోసం ధోనీ నటించిన ఓ ప్రోమోకు రెడ్​ కార్డ్​ పడింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనను అందులో సమర్థించినట్లుగా చూపడమే దానికి కారణం. ఈ ప్రోమోను త్వరలోనే తొలగించనున్నారు.

MS Dhoni
IPL 2022

By

Published : Apr 7, 2022, 6:45 PM IST

IPL 2022 Promo: చెన్నైసూపర్ కింగ్స్​ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నటించిన ఓ ఐపీఎల్​ ప్రోమోను తొలగించనున్నారు. అడ్వర్టైజింగ్​ స్టాండర్డ్స్​ కౌన్సిన్​ ఆఫ్​ ఇండియా (ఏఎస్​సీఐ) ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో ఓ రోడ్డు భద్రతా సంస్థ ఫిర్యాదు మేరకు వీడియోలో మార్పులు చేయడం లేదా తొలగించాలని ఏఎస్​సీఐ పేర్కొంది.

ఈ ఐపీఎల్​ ప్రోమోలో ధోనీ.. బస్​ డ్రైవర్​గా కనిపిస్తాడు. ట్రాఫిక్​లో చిక్కుకున్న బస్​ను వెనక్కు తీసుకొచ్చి నడిరోడ్డులోనే ఆపేస్తాడు. 'ఏం చేస్తున్నావ్​?' అని ఓ పోలీస్​ ప్రశ్నించగా.. ప్రయాణికులతో కలిసి మ్యాచ్​ సూపర్ ఓవర్ చూస్తున్నట్లు బదులిస్తాడు ధోనీ. ఇదంతా సాధారణమే అన్నట్లు పోలీస్​ అక్కడి నుంచి వెళ్లిపోతారు. లోతుగా దర్యాప్తు చేసిన అనంతరం.. వీడియోలో మార్పులు చేయడం లేదా తొలగించాలని ఏఎస్​సీఐ పేర్కొనగా.. ఏప్రిల్ 20లోగా దానిని తొలగించేందుకు సంబంధిత వర్గాలు అంగీకరించినట్లు సమాచారం.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details