IPL 2022 PBKS VS SRH: ఐపీఎల్ మెగా లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, విలియమ్సన్ శుభారంభం చేశారు. ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మను(31) షారుక్‌ఖాన్ పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ కెప్టెన్ విలియమ్సన్(3) పరుగులే ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(34) మెరుగ్గా రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మార్క్రమ్(41), నికోలస్ పూరన్(35) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు తీర్చారు. పంజాబ్ బౌలర్లలో రబాడ 2 వికెట్లు తీయగా.. రబాడ ఓ వికెట్ తీశాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్(8) పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్(14) పరుగులకే ఓటయ్యాడు. లివింగ్ స్టోన్(60), షారుక్ ఖాన్(26) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. బౌండరీలతో అదరగొట్టిన లివింగ్‌స్టోన్‌ను విలియమ్సన్ తన బంతితో పెవిలియన్‌కు పంపాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఉమ్రాన్ మాలిక్ (4/28) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడగా.. పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్‌లో ఉమ్రాన్ ఏకంగా 3 వికెట్లు తీసి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఆఖరి బంతికి అర్షదీప్ కూడా రనౌట్ కాగా.. ఈ ఓవర్‌లో పంజాబ్ మొత్తం 4 వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ 3, ఉమ్రాన్ 4, నటరాజన్, సుచిత్ తలో ఒక వికెట్ పడగొట్టారు.