IPL 2022: వరుసగా రెండో లీగ్ మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది ముంబయి ఇండియన్స్. 194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 170/8 పరుగులే చేయగలిగింది. దీంతో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది రాజస్థాన్. ముంబయి ఓపెనర్ ఇషాన్ కిషన్ (54), తిలక్ వర్మ (61) పోరాడారు. పొలార్డ్ (22) ఫర్వేలేదనిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. చాహల్‌తో పాటు రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల ముంబయికి ఓటమి తప్పలేదు. రాయల్స్ బౌలర్లలో చాహల్ 2, సైనీ 2, బౌల్ట్, ప్రసిద్ధ్, అశ్విన్ తలో వికెట్ తీశారు.
IPL 2022: ముంబయి ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి - బట్లర్
IPL 2022: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తమ రెండో లీగ్ మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది ముంబయి ఇండియన్స్. ఈ మ్యాచ్‌లో 23 పరగుల తేడాతో రాజస్థాన్ గెలుపొందింది.
MUMBAI INDIANS VS RAJASTHAN ROYALS
అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్.. ఓపెనర్ జోస్ బట్లర్ (100) చెలరేగడం వల్ల 193 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఐపీఎల్ కెరీర్లో బట్లర్‌కు ఇది రెండో సెంచరీ. రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (30), హెట్మెయిర్ (35) రాణించారు. మిగితా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో బుమ్రా 3, టైమల్ మిల్స్ 3, పొలార్డ్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇదీ చూడండి:'ధోనీ నిర్ణయాలు తీసుకోవడమేంటి?'- జడేజా షాకింగ్ కామెంట్స్!