IPL 2022 Mumbai Indians: శనివారం లఖ్‌నవూ చేతిలో పరాజయంతో ఈ సీజన్లో వరుసగా ఆరు ఓటములను మూటగట్టుకుంది ముంబయి ఇండియన్స్. దీంతో ఐపీఎల్లో ఆరు వరుస ఓటములను చవిచూసిన మూడో జట్టుగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ముంబయికి ఇలా జరగడం ఇదే తొలిసారి. 2014లో ఆ జట్టు తొలి ఐదు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ప్రస్తుత లీగ్‌లో పాయింట్ల పట్టికలోనూ అట్టడుగున కొనసాగుతోంది.
ఆరో పరాజయంతో దిల్లీ డేర్‌డెవిల్స్ (దిల్లీ క్యాపిటల్స్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరసన చేరింది ముంబయి. అయితే 2013లో దిల్లీ, 2019లో ఆర్సీబీ తమ ఏడో మ్యాచ్‌లో తొలి విజయాన్ని నమోదు చేశాయి. ముంబయి తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 21న చెన్నైసూపర్ కింగ్స్‌తో తలపడనుంది.
ఇవీ చూడండి: