తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాతమారని ముంబయి.. ఎనిమిదో ఓటమితో టోర్నీ నుంచి ఔట్ - లఖ్​నవూ సూపర్​ జయంట్స్​

IPL 2022: ముంబయి ఇండియన్స్ మరో ఓటమిని చవిచూసింది. లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో చిత్తుగా ఓడిపోయింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

MI VS LSG
MI VS LSG

By

Published : Apr 24, 2022, 11:36 PM IST

IPL 2022: ముంబయి ఇండియన్స్ రాత మారలేదు. లఖ్​నవూతో ఆదివారం జరిగిన మ్యాచ్​లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎనిమిది మ్యాచ్​లు ఆడినా.. ఇప్పటికీ ఖాతా తెరవని ముంబయి.. ఈ ఓటమితో టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్రమించినట్లైంది. మిగిలిన మ్యాచ్​లు అన్నీ గెలిచినా ముంబయి ప్లేఆఫ్స్​కు వెళ్లడం కష్టమే.

MI VS LSG result:169 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబయి ఆరంభంలో కాస్త ఆచితూచిగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అయితే, మరో ఎండ్​లో ఉన్న ఇషాన్ కిషన్ బ్యాటింగ్ టెస్టు మ్యాచ్​ను తలపించేలా సాగింది. 20 బంతులు ఆడి 8 పరుగులకే పరిమితమయ్యాడు ఈ యువ బ్యాటర్. ఒక్క బౌండరీని కొట్టలేకపోయాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్​లో ఔట్ అయ్యాడు. అయితే, అతడు ఔట్ అయిన తీరు ఆసక్తికరం. ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిన్ కట్ చేసేందుకు ప్రయత్నించగా.. బాల్ కీపర్ బూటుకు తాకింది. అది అమాంతం గాల్లోకి లేవగా.. స్లిప్​లో ఉన్న హోల్డర్.. దాన్ని సునాయాసంగా క్యాచ్ పట్టాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన డెవాల్డ్ బ్రేవిస్, సూర్యకుమార్ యాదవ్ పరిమిత స్కోర్లకే వెనుదిరిగారు.

శతకవీరుడు రాహుల్

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన లఖ్​నవూ జట్టును సారథి కేఎల్ రాహుల్ ముందుండి నడిపించాడు. 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్​లో రాహుల్​కు ఇది రెండో సెంచరీ కాగా.. ఈ రెండూ ముంబయి మీదే బాదడం విశేషం. రాహుల్ మినహా ఆ జట్టులో బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. 62 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 166 స్ట్రైక్​ రేట్​తో పరుగులు రాబట్టగా.. మిగిలిన బ్యాటర్లు అందరూ 58 బంతులు ఎదుర్కొని 57 పరుగులు మాత్రమే చేశారు.

ABOUT THE AUTHOR

...view details