IPL 2022 MI Vs KKR: కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా అదరగొట్టేసింది. ముంబయిపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 165/9 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయిని 17.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూల్చింది. ఇషాన్ కిషన్ (51) మినహా ఎవరూ రాణించలేదు. రోహిత్ 2, తిలక్ వర్మ 6, రమణ్‌దీప్ సింగ్ 12, టిమ్ డేవిడ్ 13, కీరన్ పొలార్డ్ 15, డానియల్ శామ్స్ 1, కుమార్ కార్తికేయ 3 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 3, ఆండ్రూ రస్సెల్ 2.. టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా (0) డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుత టీ20 లీగ్‌లో ముంబయి తొమ్మిదో ఓటమిని నమోదు చేసుకోగా.. కోల్‌కతాకిది ఐదో విజయం.. దీంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా (10) ఏడో స్థానానికి చేరుకుంది.
కుప్పకూలిన రోహిత్ సేన.. కోల్‌కతా ఘన విజయం - ఐపీఎల్ అప్డేట్స్
IPL 2022 MI Vs KKR: మెగా టీ20 టోర్నీలో ముంబయిపై కోల్‌కతా మరోసారి సత్తా చాటింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది కేకేఆర్.
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా అదరగొట్టేశాడు. ఇప్పటి వరకు టీ20 లీగ్‌లో పెద్దగా ప్రభావం చూపని ముంబయి బౌలర్ బుమ్రా (5/10) కోల్‌కతాపై చెలరేగాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ముంబయి ఎదుట 166 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. వెంకటేశ్ అయ్యర్ (43), అజింక్య రహానె (25), నితీశ్ రాణా (43), రింకు సింగ్ (23*) మినహా ఎవరూ రాణించలేదు. ముంబయి బౌలర్లలో బుమ్రా 5, కుమార్ కార్తికేయ 2.. డానియల్, మురుగన్ చెరో వికెట్ తీశారు. ఓవర్‌లో ఒక్క పరుగు ఇవ్వకుండానే మూడు వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు.
ఇదీ చదవండి:ఐపీఎల్ నుంచి సూర్య కుమార్ యాదవ్ ఔట్