IPL 2022 MI vs CSK: టోర్నీలో అత్యధికంగా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు.. ముంబయి. నాలుగు టైటిళ్లతో తర్వాతి స్థానంలో ఉన్న జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ రెండు జట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సగం లీగ్ పూర్తవకముందే ప్లేఆఫ్స్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై ఒక్కదాంట్లో నెగ్గి 2 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ముంబయి పదో స్థానంలో కొనసాగుతోంది. మరొక్క మ్యాచ్‌లో ఓడితే ముంబయికి ప్లేఆఫ్స్ ద్వారాలు మూసుకుపోయినట్లే. చెన్నైది దాదాపు అలాంటి పరిస్థితే.
IPL 2022: చెన్నైతో ముంబయి ఢీ.. మాజీ ఛాంపియన్లకు చావోరేవో
IPL 2022 MI vs CSK: మునుపెన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి మాజీ ఛాంపియన్లు ముంబయి ఇండియన్స్, చెన్నైసూపర్ కింగ్స్. ప్రస్తుత లీగ్‌లో పేలవ ప్రదర్శనతో టేబుల్లో అట్టడుగున కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నేడు (గురువారం) ఇరు జట్లు తలపడనున్నాయి.
IPL 2022
ఈ నేపథ్యంలో గురువారం జరిగే మ్యాచ్‌లో చెన్నై, ముంబయి అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబయి బోణీ చేస్తుందా? ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుందా? లేదా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైని విజయం వరిస్తుందా? ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుందా? అన్నది చూడాలి.
ఇదీ చూడండి:'కోహ్లీ ఒక్కడే కాదు.. అతనిలా మరో ఇద్దరు..'