IPL 2022 LSG Vs PBKS: ఐపీఎల్ 15వ సీజన్లో లఖ్‌నవూ మరో విజయం సాధించింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 20 పరుగుల తేడాతో గెలుపొందింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బ్యాటర్లలో బెయిర్ స్టో (32), మయాంక్ అగర్వాల్ (25), లివింగ్ స్టోన్ (18), శిఖర్ ధావన్ (5), భానుక రాజపక్స (9), జితేశ్ శర్మ (2), రిషి ధావన్ (21), రబాడ (2), రాహుల్ చాహర్ (4) పరుగులు చేశారు. లఖ్‌నవూ బౌలర్లలో మెహ్‌సిన్ ఖాన్ 3, చమీర 2, కృనాల్ పాండ్య 2, రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టారు. 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన కృనాల్ పాండ్య 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఈ విజయంతో లఖ్‌నవూ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది.
IPL 2022: రాణించిన బౌలర్లు.. లఖ్‌నవూ ఖాతాలో మరో విజయం - పంజాబ్
IPL 2022 LSG Vs PBKS: ఐపీఎల్ 15వ సీజన్లో ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది లఖ్‌నవూ జట్టు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. లఖ్‌నవూ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (46; 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా (34) రాణించగా.. కేఎల్ రాహుల్ (6), కృనాల్ పాండ్య (7), స్టొయినిస్ (1), ఆయుష్ బదోనీ (4), జేసన్ హోల్డర్ (11), చమీర (17) పరుగులు చేశారు. మెహ్‌సిన్ ఖాన్ (13), అవేశ్ ఖాన్ (2) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రాహుల్ చాహర్ రెండు, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి:'వారిద్దరిపై మాకు పూర్తి నమ్మకం.. త్వరలోనే ఫామ్‌లోకి రావడం ఖాయం'