IPL 2022: లఖ్‌నవూతో మ్యాచ్‌తో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు దిల్లీ ఓపెనర్ పృథ్వీ షా. 34 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. దీంతో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది దిల్లీ. 8వ ఓవర్లోనే షా ఔట్ అవడం వల్ల దిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది. డేవిడ్ వార్నర్ (4), రోవ్‌మన్ పొవెల్ (3) విఫలమయ్యారు. దీంతో నిలకడగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ రిషభ్ పంత్ (39*), సర్ఫరాజ్ ఖాన్ (36*) జోడీ.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. లఖ్‌నవూకు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
IPL 2022: షా వన్‌మ్యాన్ షో.. లఖ్‌నవూ లక్ష్యం ఎంతంటే? - dc vs lucknow
IPL 2022: లఖ్‌నవూతో మ్యాచ్ సందర్భంగా దిల్లీ ఓపెనర్ పృథ్వీ షా హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో లఖ్‌నవూ ముందు 150 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది పంత్‌సేన.
dc vs lucknow
లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ పడగొట్టారు.