తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫైనల్లో రాజస్థాన్ బ్యాటింగ్​.. ఐపీఎల్​కు గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్​ - gt vs rr 2022

IPL 2022 Final: గుజరాత్​లోని మొతేరా స్టేడియం వేదికగా గుజరాత్​ టైటాన్స్​, రాజస్థాన్​ రాయల్స్​ మధ్య ఐపీఎల్​ 2022 ఫైనల్​ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. టైటిల్ పోరులో తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్​ బ్యాటింగ్​ ఎంచుకుంది.

gt vs rr 2022
ipl 2022 final

By

Published : May 29, 2022, 7:34 PM IST

Updated : May 29, 2022, 9:06 PM IST

IPL 2022 Final: ఐపీఎల్​ తుది పోరుకు అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రంగం సిద్ధమైంది. టైటిల్​ కోసం ఆరంభ సీజన్​ విజేత రాజస్థాన్ రాయల్స్​.. అరంగేట్ర జట్టు గుజరాత్​ టైటాన్స్​ తలపడనున్నాయి. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన రాజస్థాన్​ కెప్టెన్ సంజూ శాంసన్​.. గుజరాత్​ను బౌలింగ్​కు ఆహ్వానించాడు.

ఈ సీజన్​లో గుజరాత్, రాజస్థాన్ రెండుసార్లు తలపడగా.. రెండింటిలోనూ గుజరాత్​దే పైచేయి. లీగ్​లో అడుగుపెట్టిన తొలి సీజన్​లోనే ఫైనల్​ చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన గుజరాత్​.. అదే ఊపులో కప్పుకొట్టేయాలని చూస్తుండగా, తొలి సీజన్​లో టైటిల్ గెలిచాక ఇంత కాలానికి మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిన రాజస్థాన్ ఈ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోంది. చూడాలి మరి విజయం ఎవరిని వరిస్తుందో?

ఇవీ జట్లు:

గుజరాత్:వృద్ధిమాన్ సాహా (వికెట్​కీపర్), శుభ్​మన్ గిల్, మ్యాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహ్మద్ షమీ

రాజస్థాన్:యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), దేవ్​దత్ పడిక్కల్, హెట్​మెయిర్, రియాన్ పరాగ్, అశ్విన్, బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, మెక్​కాయ్, యుజ్వేంద్ర చాహల్

ఘనంగా ముగింపు వేడుకలు:కరోనా కారణంగా గత మూడేళ్లుగా టీ20 లీగ్​లో ఫైనల్​ మ్యాచ్​కు ముందు ముగింపు వేడకలు నిర్వహించలేదు. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడం వల్ల ఈ ఏడాది ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ రణ్​వీర్ సింగ్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సందడి చేశారు.

గిన్నిస్ రికార్డు: ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో ప్రపంచంలోనే అతిపెద్ద జెర్సీతో గిన్నిస్ వరల్డ్​ రికార్డును సాధించింది ఐపీఎల్.

ఇవీ చూడండి:

'కిల్లర్ మిల్లర్'​ టు 'జోస్ ది బాస్'​.. ఫైనల్లో వీరి ఆట చూసి తీరాల్సిందే

IPL final 2022: ఈ ఫైనల్స్​​ వెరీ స్పెషల్​.. ఎందుకంటే?

IPL final 2022: ఈసారి కప్పు ఎవరికి దక్కెనో? కొత్తదనమా లేక పాతపరమా?

Last Updated : May 29, 2022, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details