IPL 2022 Covid:దిల్లీ బృందంలో కరోనా కలకలంతో బుధవారం దిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదికలో మార్పు చోటుచేసుకుంది. షెడ్యూల్ ప్రకారం పుణెలో బుధవారం జరగాల్సిన మ్యాచ్‌ను ముంబయిలో నిర్వహించాలని నిర్ణయించినట్టు బీసీసీఐ ప్రకటించింది. దిల్లీ బృందంలో ఐదు పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా వేదికను మార్పు చేసినట్టు వెల్లడించిన బీసీసీఐ.. సుదూర బస్సు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
కొవిడ్ దెబ్బ.. దిల్లీ, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు - కరోనా బీసీసీఐ దిల్లీ పంజాబ్
IPL 2022: కరోనా కారణంగా దిల్లీ, పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వేదికను మార్చుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పుణెలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను ముంబయిలో నిర్వహించనున్నట్లు తెలిపింది.
ప్యాట్రిక్ (ఫిజియోథెరపిస్ట్)కు ఈ నెల 15న కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. చేతన్‌కుమార్ (స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్)కు ఏప్రిల్ 16న, మిచెల్ మార్ష్ (ఆటగాడు), డాక్టర్ అభిజిత్ సాల్వి (జట్టు వైద్యుడు), ఆకాశ్ మానె (సోషల్ మీడియా కంటెంట్ టీం సభ్యుడు)కు ఏప్రిల్ 18న కరోనా పాజిటివ్‌గా తేలిందని బీసీసీఐ పేర్కొంది. వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపింది.
ఇదీ చదవండి:ఫించ్‌తో మాటల యుద్ధం.. భారత క్రికెటర్‌పై నెటిజన్ల ఆగ్రహం!