IPL 2022: బెంగళూరు బౌలర్లను ఉతికారేశారు చెన్నై బ్యాటర్లు రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 88), శివం దూబె (95). దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 216/4 పరుగులు చేసింది. 10 ఓవర్లకు 60 పరుగుల వద్ద ఉన్న స్థాయి నుంచి సిక్సర్లు, ఫోర్లతో మోతమోగించారు ఉతప్ప, దూబె. దీంతో బెంగళూరుకు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది చెన్నై. ఓపెనర్ రుతురాత్ గైక్వాడ్ (17) మరోసారి స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాడు. మొయిన్ అలీ (3) రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఉతికారేసిన ఉతప్ప, దూబె.. బెంగళూరు ముందు భారీ లక్ష్యం - దూబె
IPL 2022: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు చెన్నై ఓపెనర్ రాబిన్ ఉతప్ప, శివం దూబె. దీంతో ఆర్సీబీకి 217 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది సీఎస్కే.
csk vs rcb 2022
బెంగళూరు బౌలర్లలో హసరంగ 2, జోష్ హేజిల్‌వుడ్ ఒక వికెట్ పడగొట్టారు.