తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయి ప్లేఆఫ్స్​ చేరేనా? గణాంకాలు ఏం చెబుతున్నాయి? - రోహిత్‌ శర్మ

IPL 2022: ఐదుసార్లు ఛాంపియన్​ ముంబయి ఇండియన్స్​.. ప్రస్తుత ఐపీఎల్​లో దారుణంగా విఫలమవుతోంది. గత సీజన్​లాగే ఈసారి కూడా ప్లేఆఫ్స్​ చేరకుండానే ఇంటిముఖం పడుతుందా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే ప్రస్తుత సీజన్​లో ముంబయి నాకౌట దశకు చేరేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూడండి.

IPL 2022
Mumbai Indians

By

Published : Apr 16, 2022, 4:28 PM IST

IPL 2022: భారత టీ20 లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో ఆ జట్టు ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచి ప్రత్యేక గుర్తింపు సాధించింది. అయితే, అంత గొప్ప రికార్డున్న ముంబయి గత సీజన్‌లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా ఇంటి ముఖం పట్టగా.. ఈసారి మరింత దారుణంగా తడబడుతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతోంది. ఇక్కడ నెట్‌ రన్‌రేట్‌ కూడా (-1.072) మైనస్‌లో ఉండటం ఆ జట్టు పరిస్థితిని తెలియజేస్తుంది. ఇది ముంబయి అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ముంబయి ప్లేఆఫ్స్‌ చేరుతుందా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా జట్లన్నీ (చెన్నై మినహా) రెండు మూడు ఓటములు తప్ప బాగానే ఆడుతున్నాయి. దీంతో ప్లేఆఫ్స్‌ రేసులో ఎవరు నిలుస్తారనేది చెప్పడం చాలా కష్టంగా మారింది. అలాంటప్పుడు ముంబయి నాకౌట్‌ దశకు చేరుకునే అవకాశాలు కూడా మరింత సంక్లిష్టంగా మారే పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఇక్కడ ఊరటగొలిపే ఒక్క విషయం.. ముంబయి ఇప్పటికీ ప్లేఆఫ్స్‌ చేరే వీలుంది.

ఇకపై ఆడాల్సిన 9 మ్యాచ్‌ల్లో ముంబయి జట్టు 8 విజయాలు సాధిస్తే 16 పాయింట్లతో నాకౌట్‌కు చేరే ఛాన్స్‌ ఉంది. ఒకవేళ లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యే సమయానికి ఇతర జట్లు ఏవైనా అన్నే పాయింట్లు సాధిస్తే అప్పుడు మెరుగైన రన్‌రేట్‌ ఉండాల్సిన అవసరం ఉంది. అలా ఉంటేనే.. ముంబయి ప్లేఆఫ్స్‌ చేరుతుంది. కానీ, ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన తీరు చూస్తుంటే అది కష్టంగా అనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముంబయి ఏదైనా అద్భుతం చేసి టాప్‌ నాలుగులో నిలుస్తుందో లేదో చూడాలి.

ఇదీ చూడండి:'ఐదారు గేమ్​లు ఓడిపోతే తప్ప ముంబయి నిద్రలేవదు'

ABOUT THE AUTHOR

...view details