Deepak Chahar out of IPL 15: వెన్ను గాయం కారణంగా ఐపీఎల్లో ఆడాలనే దీపక్ చాహర్ ఆశలు గల్లంతయ్యాయి! దీంతో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నైసూపర్ కింగ్స్‌కు కోలుకోలేని దెబ్బపడినట్లు అయ్యింది. తమ ప్రధాన అస్త్రం చాహర్ లేకుండానే ఈ సీజన్లో బరిలోకి దిగిన చెన్నై.. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
మెగావేలంలో రూ.14 కోట్లు పెట్టి తిరిగి దక్కించుకున్న చాహర్.. ఏప్రిల్ రెండో వారంలో అందుబాటులోకి వస్తాడని చెన్నై ఆశించింది. అయితే తొడ కండరాల గాయం నుంచి కోలుకొని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్న చాహర్‌కు మరో గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు ఐపీఎల్ 15 మొత్తానికి దూరమవుతాడని సమాచారం.