కోల్‌కతాతో మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు కేన్ విలియమ్సన్ బరిలోకి దిగకపోవడంపై ఆ జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ స్పందించాడు. కేన్ ఫిట్నెస్ సాధించడానికి మరికొంత సమయం అవసరమని స్పష్టం చేశాడు.
"మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి కేన్‌కు మరికొంత సమయం పడుతుందని మేము భావిస్తున్నాము. మరికొంత నెట్ సాధన చేయాల్సిన అవసరముంది. జానీ బెయిర్ స్టో స్థానంలో విలియమ్సన్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కానీ, మేము దాని గురించి అంతగా బాధ పడట్లేదు. ఎందుకంటే బెయిర్ స్టో ఇటీవల భారత్‌తో సిరీస్ సందర్భంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫామ్ అందిపుచ్చుకున్నాడు. నంబర్ 4లో అతడు స్థిరంగా రాణించాడు. త్వరలోనే కేన్ తుది జట్టులోకి వస్తాడు."
-ట్రెవర్ బేలిస్, సన్‌రైజర్స్ కోచ్.
బ్యాటింగ్ ఆర్డర్లో సమద్ కంటే ముందు విజయ్ శంకర్‌ను పంపడంపై బేలిస్ స్పందించాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో శంకర్.. బంతిని బలంగా బాదాడని తెలిపాడు. ఓ మ్యాచ్‌లో ఏకంగా 95 పరుగులు చేశాడని పేర్కొన్నాడు. విజయ్ తమ అత్యుత్తమ ప్లేయర్ అని అభిప్రాయపడ్డాడు. చాలా బంతులను స్టాండ్స్‌లోకి పంపాడని.. అందుకే అతడిని ముందు పంపామని ఎస్ఆర్హెచ్ కోచ్ వెల్లడించాడు.