తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​ తనయుడికి తొలిమ్యాచ్​లో అవకాశం దక్కేనా? - అర్జున్ తెందూల్కర్ ఐపీఎల్

ఐపీఎల్​ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, ముంబయి ఇండియన్స్​ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్​లో మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్ తనయుడు అర్జున్​ తెందూల్కర్​ ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ​అయితే తొలిమ్యాచ్​లో అర్జున్​కు ఆడే అవకాశం వస్తుందా? అని పలువురు క్రికెట్​ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసున్నారు.

Will Arjun Tendulkar be part of Mumbai Indians playing XI vs RCB
అర్జున్ తెందూల్కర్

By

Published : Apr 9, 2021, 5:36 PM IST

క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. చెన్నై వేదికగా జరగనున్న తొలి మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో డిఫెండింగ్​ ఛాంపియన్స్​ ముంబయి ఇండియన్స్​ తలపడనుంది. అయితే ముంబయి జట్టులో ఈసారి ప్రత్యేకత ఏంటంటే? మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ వారసుడు ప్రస్తుత ఐపీఎల్​లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో అర్జున్ తెందూల్కర్​కు ఆర్సీబీతో జరిగే తొలి మ్యాచ్​లోనే ఆడే అవకాశం ఇస్తారా? లేదా బెంచ్​కే పరిమితమవుతాడా? అని మిలియన్​ డాలర్ల ప్రశ్న.

ముంబయి ఇండియన్స్ బౌలింగ్​ లైనప్​లో ఇప్పటికే హార్దిక్​ పాండ్య, క్రునాల్​ పాండ్య, కిరెన్​ పొలార్డ్​ వరుసగా 5, 6, 7 స్థానాల్లో ఉంటారు. ఆ తర్వాత లెగ్​ స్పిన్నర్​ స్థానంలో రాహుల్​ చాహర్​ లేదా పియూష్​ చావ్లాను జట్టులో తీసుకునే అవకాశం ఉంది. స్టార్ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా, న్యూజిలాండ్​ ఫాస్ట్​ బౌలర్ ట్రెంట్​ బౌల్ట్​లతో పాటు నాథన్ కౌల్టర్​ నైల్​ లేదా ఆడమ్​ మిల్నేను తీసుకొవచ్చు. ఆరంభ మ్యాచ్​లో ముంబయి జట్టులోని కొంతమంది కీలకఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తే తప్ప అర్జున్ తెందూల్కర్​కు అవకాశం లభించదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైన సచిన్ తెందూల్కర్​ వారసుడిగా అర్జున్​ ఐపీఎల్​ ఏ మ్యాచ్​లో అరంగేట్రం చేస్తాడోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి:ఐపీఎల్​ ప్రారంభ వేడుకకు ముఖ్యఅతిథులు వీరే!

ABOUT THE AUTHOR

...view details