ఐపీఎల్.. బీసీసీఐకి వేలకోట్ల రూపాయలు తెచ్చిపెట్టే ఆదాయవనరు. ప్రతి ఏడాది వేసవిలో మన దేశంలో జరిగే ఈ టోర్నీ కోసం విదేశీ క్రికెటర్లతో పాటు దేశవాళీ ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అదృష్టం బాగుంటే ఒక్క సీజన్‌తో స్టార్లు అయిపోతారు. అలాంటిది ఈ సీజన్లో పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడటం వల్ల ఎప్పుడూ లేనిది లీగ్ నిరవధిక వాయిదా పడింది.
కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో దేశంలో ఓవైపు మనుషులు చనిపోతుంటే, లీగ్ నిర్వహించడమేంటి? అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ మాత్రం మిగిలిన మ్యాచ్‌ల్ని ఈ ఏడాదే కచ్చితంగా నిర్వహిస్తామనే పట్టుదలతో ఉంది.
గతేడాది సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య యూఏఈ వేదికగా బీసీసీఐ, ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించింది. అది జరిగిన నాలుగు నెలల తర్వాత, అంటే ఏప్రిల్ 9 నుంచి కొత్త సీజన్‌ను స్వదేశంలో ప్రారంభించింది. సరిగ్గా అదే సమయంలో భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మొదలవడం, వైరస్ ప్రభావంతో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అలాంటి సమయంలోనూ ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు విజయవంతంగా జరిగాయి.
ఆ కారణం వల్లే సీజన్ వాయిదా!
సీజన్‌లోని 31 మ్యాచ్‌లు బాగానే జరిగాయి. అయితే దిల్లీ, అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత కోల్‌కతా, చెన్నై, దిల్లీ, హైదరాబాద్ జట్లలోని పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. అప్పుడు తొలుత మ్యాచ్‌ల్ని వాయిదా వేశారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం సీజన్‌ను వాయిదా వేసినట్లు బోర్డు వెల్లడించింది.
రద్దయితే బీసీసీఐకి భారీ నష్టం!